MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Football
  • FIFA World Cup 2026 Prize Money: గెలవకుండా ఇంటికెళ్లే టీమ్‌కు రూ. 100 కోట్లా? ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

FIFA World Cup 2026 Prize Money: గెలవకుండా ఇంటికెళ్లే టీమ్‌కు రూ. 100 కోట్లా? ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

FIFA World Cup 2026 Prize Money: ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రైజ్ మనీ రికార్డు స్థాయికి చేరింది. క్రికెట్ వరల్డ్ కప్‌లో గెలిచిన టీమ్ కంటే, ఫుట్‌బాల్ టోర్నీలో లాస్ట్ ప్లేస్‌లో నిలిచే టీమ్‌కే ఎక్కువ డబ్బులు రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 10 2026, 08:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
క్రికెట్ కంటే ఫుట్‌బాల్ లోనే ఎక్కువ పైసలు.. లాస్ట్ ప్లేస్ టీమ్ పై కూడా కోట్ల వర్షం
Image Credit : ChatGPT

క్రికెట్ కంటే ఫుట్‌బాల్ లోనే ఎక్కువ పైసలు.. లాస్ట్ ప్లేస్ టీమ్ పై కూడా కోట్ల వర్షం

ఫుట్‌బాల్ ప్రేమికులకు పూనకాలు తెప్పించే టైమ్ వచ్చేసింది. అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా హోస్ట్ చేస్తున్న 'ఫిఫా వరల్డ్ కప్ 2026' చరిత్రలోనే బిగ్గెస్ట్ స్పోర్టింగ్ ఈవెంట్‌గా రికార్డులకెక్కబోతోంది. ఈ సారి సీన్ మామూలుగా లేదు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ 32 దేశాల నుంచి ఏకంగా 48 దేశాలు ఈ మెగా టోర్నీలో తలపడబోతున్నాయి.

మ్యాచ్‌ల సంఖ్య కూడా 64 నుంచి ఏకంగా 104కి పెరిగింది. అయితే కేవలం జట్లు, మ్యాచ్‌లే కాదు.. ఈసారి ఫిఫా ఆఫర్ చేస్తున్న 'ప్రైజ్ మనీ' చూస్తే ప్రపంచంలోనే రిచెస్ట్ బోర్డుగా చెప్పుకునే ఐసీసీ (ICC)కి కూడా దడ పుట్టడం ఖాయం. క్రికెట్ వరల్డ్ కప్ ప్రైజ్ మనీ మొత్తం కలిపినా, ఫిఫాలో లాస్ట్ ప్లేస్‌లో నిలిచే ఒక్క టీమ్‌కు వచ్చే పైసల కంటే తక్కువంటే నమ్ముతారా? అవును, ఇది అక్షరాలా నిజం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
FIFA World Cup 2026 Prize Money: రూ. 8,300 కోట్ల భారీ ప్యాకేజీ.. అసలు లెక్కలివే
Image Credit : Getty

FIFA World Cup 2026 Prize Money: రూ. 8,300 కోట్ల భారీ ప్యాకేజీ.. అసలు లెక్కలివే

ఫిఫా ప్రెసిడెంట్ జియాని ఇన్ఫాంటినో అనౌన్స్ చేసిన వివరాల ప్రకారం.. ఈ 2026 వరల్డ్ కప్ కోసం టోటల్ ప్రైజ్ పూల్, ప్రిపరేషన్ గ్రాంట్లు, సబ్సిడీలు అన్ని కలిపి ఏకంగా 871 మిలియన్ డాలర్లు కేటాయించారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 8,300 కోట్లకు పైమాటే.. గతంలో 2022లో జరిగిన కతర్ వరల్డ్ కప్ టోటల్ ప్రైజ్ పూల్ 440 మిలియన్ డాలర్లు ఉండగా, ఈసారి దాన్ని ఏకంగా 655 మిలియన్ డాలర్ల డైరెక్ట్ ప్రైజ్ మనీకి పెంచేశారు. కమర్షియల్ సక్సెస్, స్పాన్సర్‌షిప్స్ ద్వారా వచ్చిన క్రేజీ ఇన్కమ్ వల్లే ఈ స్థాయిలో నిధులు పెంచగలిగామని ఫిఫా గర్వంగా చెప్తోంది.

Related Articles

Related image1
IND vs AFG: పంత్ కొట్టిన దెబ్బకు డ్రోన్ క్రాష్.. మ్యాచ్ స్టాప్? అసలు ఏం జరిగిందంటే?
Related image2
SKY: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్ బై? సోషల్ మీడియాలో పోస్టులన్నీ డిలీట్.. ఏం జరుగుతోంది?
37
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ
Image Credit : Getty

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ

2023లో ఇండియాలో జరిగిన ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ టోటల్ ప్రైజ్ పూల్ ఎంతో తెలుసా? కేవలం 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 83 కోట్లు) మాత్రమే. ఇందులో కప్ కొట్టిన ఆస్ట్రేలియాకు వచ్చింది కేవలం 4 మిలియన్ డాలర్లు (రూ. 33 కోట్లు). కానీ, ఫిఫా వరల్డ్ కప్ 2026లో గ్రూప్ స్టేజ్ దాటకుండా, ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా దారుణంగా ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోయే టీమ్‌కు కూడా కనీసం 12.5 మిలియన్ డాలర్లు దక్కుతాయి. ఇందులో 10 మిలియన్ డాలర్ల క్వాలిఫికేషన్ పేమెంట్ + 2.5 మిలియన్ డాలర్ల ప్రిపరేషన్ గ్రాంట్ ఉంటాయి. అంటే క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన టీమ్ కంటే, ఫుట్‌బాల్‌లో లాస్ట్ ప్లేస్‌లో వచ్చే టీమ్ ఎక్కువ సొమ్ముతో ఇంటికెళ్తుంది.

47
గ్లోబల్ మార్కెట్ ఎఫెక్ట్.. నార్త్ అమెరికా క్రేజ్
Image Credit : Getty

గ్లోబల్ మార్కెట్ ఎఫెక్ట్.. నార్త్ అమెరికా క్రేజ్

క్రికెట్ వరల్డ్ కప్‌లో ఆడేది కేవలం 10 జట్లే, కానీ ఫుట్‌బాల్‌లో 48 దేశాలు బరిలోకి దిగుతున్నాయి. పైగా ఫుట్‌బాల్‌కు ఉన్న గ్లోబల్ మార్కెట్, బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్, సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్ క్రికెట్ కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ. ఈసారి టోర్నమెంట్ నార్త్ అమెరికాలో జరగడం కూడా ఒక ప్లస్ పాయింట్. ఎందుకంటే ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్పోర్ట్స్ మార్కెట్ అక్కడ ఉంది. 104 మ్యాచ్‌లు జరగడం వల్ల టికెట్ సేల్స్, గ్లోబల్ టీవీ ఆడియన్స్ పెరిగి ఫిఫా ఖజానా నిండిపోతోంది. అందుకే ప్లేయర్స్, క్లబ్స్ నుంచి వస్తున్న ప్రెజర్‌ను బ్యాలెన్స్ చేస్తూ ప్రైజ్ మనీని ఈ రేంజ్‌లో పెంచేసింది.

57
రికార్డులు బద్దలు.. రూ. 476 కోట్ల విజేత బహుమతి
Image Credit : Getty

రికార్డులు బద్దలు.. రూ. 476 కోట్ల విజేత బహుమతి

ఫిఫా వరల్డ్ కప్ హిస్టరీ చూస్తే ప్రైజ్ మనీ ఎలా పెరిగిందో అర్థమవుతుంది. 1982లో ఇటలీ గెలిచినప్పుడు ప్రైజ్ మనీ కేవలం 2.2 మిలియన్ డాలర్లు. కానీ 2006లో ఇటలీ మళ్ళీ గెలిచినప్పుడు అది 20 మిలియన్ డాలర్లకు చేరింది. 2022లో మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా కప్ కొట్టినప్పుడు 42 మిలియన్ డాలర్లు రాగా, ఈ 2026లో కప్ కొట్టబోయే టీమ్‌కు ఏకంగా 50 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 476 కోట్లు) అకౌంట్‌లో పడబోతున్నాయి. రన్నరప్ టీమ్‌కు రూ. 314 కోట్లు, థర్డ్ ప్లేస్ టీమ్‌కు రూ. 276 కోట్లు దక్కనున్నాయి.

67
ఈ పైసలన్నీ ఎక్కడికి పోతాయి?
Image Credit : Getty

ఈ పైసలన్నీ ఎక్కడికి పోతాయి?

ఫిఫా ఇచ్చే ఈ భారీ ప్రైజ్ మనీ మొత్తం కేవలం ప్లేయర్స్ జేబుల్లోకే వెళ్ళదు. ఆయా దేశాల నేషనల్ ఫుట్‌బాల్ ఫెడరేషన్లు ఈ సొమ్మును వివిధ రకాలుగా డివైడ్ చేస్తాయి. ప్లేయర్స్ బోనస్‌లు, కోచింగ్ స్టాఫ్ పేమెంట్లు కాకుండా.. ఎక్కువ శాతం అమౌంట్‌ను దేశంలో ఫుట్‌బాల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్, గ్రాస్‌రూట్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యూత్ అకాడమీల కోసం ఇన్వెస్ట్ చేస్తారు. చిన్న దేశాలకు ఈ వరల్డ్ కప్ మనీ అనేది ఒక సంజీవని లాంటిది. ఒక్కసారి క్వాలిఫై అయితే చాలు, వచ్చే పైసలతో ఆ దేశ ఫుట్‌బాల్ ఫ్యూచరే మారిపోతుంది. జూలై 20న ఫైనల్ విజిల్ పడేసరికి, గెలిచిన టీమ్ చేతికి హిస్టారికల్ ట్రోఫీతో పాటు స్పోర్ట్స్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ అమౌంట్ అందబోతోంది.

77
ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రైజ్ మనీ
Image Credit : Getty

ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రైజ్ మనీ

ఛాంపియన్ కు -$50 మిలియన్లు (దాదాపు రూ. 415 కోట్లు)

రన్నరప్ -$33 మిలియన్లు (దాదాపు రూ. 274 కోట్లు)

3వ ప్లేస్ - $29 మిలియన్లు (దాదాపు రూ. 240 కోట్లు)

4వ ప్లేస్ -$27 మిలియన్లు- రూ. 224 కోట్లు

ప్రిపరేషన్ గ్రాంట్- $2.5 మిలియన్లు (ప్రతీ జట్టుకు దాదాపు రూ. 20 కోట్లు)

ఇలా టోర్నీలో పాల్గొన్న అన్ని జట్లకు ప్రైజ్ మనీ అందిస్తారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
FIFA ప్రపంచ కప్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
Latest Videos
Recommended Stories
Recommended image1
Lionel Messi: వంతారాలో మెస్సి సందడి.. అనంత్ అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ చూసి ఫిదా !
Recommended image2
Lionel Messi : హైదరాబాద్ అభిమానులకు మెస్సీ స్పెషల్ గిఫ్ట్.. ఎమోషనల్ స్పీచ్ విన్నారా?
Recommended image3
Lionel Messi : మెస్సీతో సై అంటే సై.. సీఎం రేవంత్ రెడ్డి రచ్చ.. ఎవరు గెలిచారు?
Related Stories
Recommended image1
IND vs AFG: పంత్ కొట్టిన దెబ్బకు డ్రోన్ క్రాష్.. మ్యాచ్ స్టాప్? అసలు ఏం జరిగిందంటే?
Recommended image2
SKY: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్ బై? సోషల్ మీడియాలో పోస్టులన్నీ డిలీట్.. ఏం జరుగుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved