MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Rain Alert: భారీ వర్షాలు.. రెండో ప్రమాద హెచ్చరిక ప్ర‌క‌టించే అవ‌కాశం, ప్రజలకు కీలక సూచన

Rain Alert: భారీ వర్షాలు.. రెండో ప్రమాద హెచ్చరిక ప్ర‌క‌టించే అవ‌కాశం, ప్రజలకు కీలక సూచన

Rain Alert: భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

1 Min read
Author : Narender Vaitla
Published : Jul 31 2026, 09:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భద్రాచలం, పోలవరం వద్ద పెరుగుతున్న నీటి మట్టం
Image Credit : Gemini AI

భద్రాచలం, పోలవరం వద్ద పెరుగుతున్న నీటి మట్టం

శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయానికి భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 49.8 అడుగులకు చేరుకుంది. కూనవరం వద్ద 16.35 మీటర్లు, పోలవరం వద్ద 10.26 మీటర్ల నీటి మట్టం నమోదైంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో రెండూ 5,39,934 క్యూసెక్కులుగా ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే శుక్రవారం రాత్రి మొదటి ప్రమాద హెచ్చరిక, శనివారం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు
Image Credit : X

ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు

వరద ప్రభావం ఉండే అవకాశం ఉన్న తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు, పోలవరం ప్రాంతాల అధికారులను ఇప్పటికే అప్రమత్తం చేశారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాల్లో నివసించే ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా యంత్రాంగానికి సూచనలు ఇచ్చారు.

Related Articles

Related image1
Tirumala: ప్లాంట్ కొంటే.. జీవితాంతం తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనం. రంగంలోకి టీటీడీ
Related image2
షాపింగ్ మాల్స్‌లో డ్ర‌స్‌ల‌కు ఉండే ఈ ట్యాగ్‌లు ఏంటో తెలుసా? ఇవి ఎలా ప‌నిచేస్తాయంటే.?
35
సహాయక చర్యలకు సిద్ధంగా NDRF, SDRF బృందాలు
Image Credit : X

సహాయక చర్యలకు సిద్ధంగా NDRF, SDRF బృందాలు

అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అమలాపురం, రాజమహేంద్రవరం, చింతూరు, వీఆర్‌పురం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో మూడు NDRF, మూడు SDRF బృందాలను సిద్ధంగా ఉంచారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా వెంటనే స్పందించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అత్యవసర సహాయం లేదా సమాచారం కోసం 112, 1070, 1800 425 0101 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని ప్రజలను కోరింది.

45
ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి
Image Credit : X

ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి

వరదల సమయంలో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, కల్వర్టులు, కాజ్‌వేల మీదుగా ప్రయాణాలు చేయకూడదని అధికారులు హెచ్చరించారు. అలాగే గోదావరి నదిలో స్నానం చేయడం, ఈత కొట్టడం, చేపల వేటకు వెళ్లడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

55
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
Image Credit : Gemini AI

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

ఆగస్టు 1 (శనివారం) మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం పరిసరాలు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ఈ జిల్లాల ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
వాతావరణం
అమరావతి
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
భోగాపురం వేదికగా గిన్నిస్ రికార్డ్ | Dhimsa Dance at Bhogapuram Airport | Asianet News Telugu
Recommended image2
Now Playing
ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు.. రెండున్నర గంటలపాటు భోగాపురంలో మోదీ | Asianet News Telugu
Recommended image3
School Holidays : తెలుగు విద్యార్థులకు ఊహించని సెలవులు.. ఈ మూడ్రోజులు స్కూల్స్ బంద్, వీకెండ్ కాదు లాంగ్ వీకెండ్
Related Stories
Recommended image1
Tirumala: ప్లాంట్ కొంటే.. జీవితాంతం తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనం. రంగంలోకి టీటీడీ
Recommended image2
షాపింగ్ మాల్స్‌లో డ్ర‌స్‌ల‌కు ఉండే ఈ ట్యాగ్‌లు ఏంటో తెలుసా? ఇవి ఎలా ప‌నిచేస్తాయంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved