Asianet News TeluguAsianet News Telugu

చియా గింజలతో పురుషుల్లో లైంగిక వాంఛ పెరుగుతుందా?

ప్రస్తుత కాలంలో చాలా మంది పురుషులు తక్కువ సెక్స్ డ్రైవ్ సమస్యను ఫేస్ చేస్తున్నారు. చిన్న వయసు వారైనా..  తక్కువ లైంగిక కోరికలతో బాధపడుతున్నారు. అయితే చియా గింజలతో పురుషుల్లో ఆ సమస్యలను పొగొట్టొచ్చని నిపుణులు అంటున్నారు. 
 

benefits of chia seeds for sexual health
Author
First Published Mar 18, 2023, 12:18 PM IST

లైంగిక జీవితం మెరుగ్గా ఉంటేనే ఆ బంధం బాగుండటమే కాదు.. ఆరోగ్యం కూడా బేషుగ్గా ఉంటుంది. కానీ ప్రస్తుత కాలంలో యువకులు కూడా తక్కువ లైంగిక కోరికలను కలిగి ఉంటున్నారు. ఇది వారి లైంగిక జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చియా విత్తనాలు లైంగిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ చియా విత్తనాలను తినే వారు చాలా తక్కువ మందే ఉన్నారు. దీనిలో పోషకాలు, ఔషధ విలువలు పుష్కలంగా ఉంటాయి. ఈ విత్తనాలు శారీరక ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి, లైంగిక ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. 

చియా విత్తనాల పోషక విలువలు

మాలిక్యూల్ జర్నల్ ప్రకారం.. చియా విత్తనాలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, పాలీఅన్శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, డైటరీ ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఈ విత్తనాలు పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లకు అద్భుతమైన మూలం. ఈ విత్తనాల్లో కెఫిక్ ఆమ్లం, రోస్మరినిక్ ఆమ్లం, మైరిసెటిన్, క్వెర్సెటిన్ సమ్మేళనాలు కూడా ఉంటాయి. కెఫిక్ ఆమ్లం అనేది యాంటీ ఆక్సిడెంట్. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ లైంగిక వాంఛను పెంచుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.

లైంగిక వాంఛను పెంచుకోవడం ఎలా?

ది జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ ప్రకారం.. చియా విత్తనాలను సరైన మొత్తంలో తీసుకుంటే మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో పురుషుల్లో లైంగిక వాంఛ పెరుగుతుంది. ఈ విత్తనాలలో మన శరీరం ఉత్పత్తి చేయలేని ఒమేగా -3 వంటి ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి సహజంగా టెస్టోస్టెరాన్ పెంచడానికి సహాయపడతాయి. దీనివల్ల ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొన్నా అలసట  రాదు.

ఆడవారి పునరుత్పత్తి ఆరోగ్యం

జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చియా విత్తనాలపై ప్రచురించిన పరిశోధనా వ్యాసాలు మహిళల పునరుత్పత్తి ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉన్నాయని వివరిస్తున్నాయి. ఈ విత్తనాలలో కొవ్వు నూనెలు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ పోషకాలన్నీ శిశువు మెదడు ఎదుగుదలకు తోడ్పడతాయి.

తల్లి పాల కోసం చియా విత్తనాలు

చియా విత్తనాలు తల్లిపాలను పెంచుతాయి. అందుకే తల్లులు చియా విత్తనాలను తినాలని నిపుణులు చెప్తారు. ఉప్పు, మిరియాలు రోజువారీ మసాలా దినుసులుగా వాడుతున్నట్టే చిటికెడు చియా విత్తనాలను కూడా ఆహారంలో చేర్చాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మీరు రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు.

సంతానోత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది

జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ ప్రకారం.. చియా విత్తనాలలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ఇనుము, మెగ్నీషియం, జింక్ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గర్భధారణకు సహాయపడతాయి. ఇవి శరీరంలో ఆరోగ్యకరమైన గుడ్లు, ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి. అలాగే హార్మోన్లను నియంత్రిస్తాయి. పునరుత్పత్తి అవయవాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతాయి.

Follow Us:
Download App:
  • android
  • ios