కమెడియన్ గా టాలీవుడ్ లో సరికొత్త యాంగిల్ లో గుర్తింపు తెచ్చుకున్న వేణు మాధవ్ మరణించడం అభిమానులను సినీ ప్రముఖులను కలచివేసింది. బుధవారం చిక్కిత్సపొందితు మరణించిన వేణు మాధవ్ కి గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆయన మరణం పట్ల ఇండియన్ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ కూడా సంతాపం తెలియజేశారు. 

ఐపీఎల్ టోర్నీలో హైదరాబాద్ టీమ్ తరపున ఆడుతున్న యూసఫ్ తెలుగు వారికి బాగా దగ్గరయ్యారు. అయితే రీసెంట్ గా మరణించిన వేణు మాధవ్ పై ఆయనకున్న అభిప్రాయాన్ని చెప్పారు. నేను చూసిన మంచి హాస్య నటుల్లో వేణు మాధవ్ ఒకరు. ఆయన మరణం నన్ను షాక్ కి గురి చేసింది. ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. వేణుమాధవ్ కుటుంబ సబ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ యూసుఫ్ ట్వీట్ చేశారు.  

ఇక యూసఫ్ కి వేణుమాధవ్ ఎలా తెలుసు అనే ప్రశ్నలు చాలా వస్తున్నాయి. అయితే టాలీవుడ్ హిందీ డబ్బింగ్ సినిమాల ద్వారా నార్త్ ఆడియెన్స్ మన యాక్టర్స్ ని గుర్తుపడతారు అని మరికొంత మంది సమాధానాలు ఇస్తున్నారు. ఇక వేణుమాధవ్ అంత్యక్రియలు నిన్న లక్ష్మి నగర్ స్మశానవాటికలో జరిగాయి, మెగాస్టార్ చిరంజీవితో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులు వేణుమాధవ్ పార్థివదేహానికి నివాళులర్పించారు.