Venu Madhav  

(Search results - 44)
 • shakeela

  News11, Feb 2020, 12:37 PM

  ''నాకు ఫోన్ చేసేది వాడొక్కడే.. ఇప్పుడు వాడు కూడా లేడు''

  తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె వేణుమాధవ్ ని తలచుకొని కన్నీరు పెట్టుకుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా షకీలా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

 • vijaya nirmala

  News28, Dec 2019, 9:47 AM

  2019 ఇయర్ రౌండప్ : స్వర్గస్తులైన టాలీవుడ్ సెలబ్రెటీలు

  సినిమాలు హిట్ లు, ప్లాఫ్ ల సంగతి పక్కనపెడితే.. ఈ సంవత్సరం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ఈ లోకాన్ని విడిచి స్వర్గస్తులయ్యారు. 

 • venu madhav

  ENTERTAINMENT27, Sep 2019, 8:34 AM

  వేణుమాధవ్ మరణం గురించి తెలిసి షాక్ అయ్యా: ఇండియన్ క్రికెటర్

  బుధవారం చిక్కిత్సపొందితు మరణించిన వేణు మాధవ్ కి గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆయన మరణం పట్ల ఇండియన్ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ కూడా సంతాపం తెలియజేశారు. 

 • Disco shanthi
  Video Icon

  ENTERTAINMENT26, Sep 2019, 7:54 PM

  మా ఇంట్లో ఒక బిడ్డ ఆయన - డిస్కోశాంతి (వీడియో)

  వేణుమాధవ్ తమ ఇంట్లో ఒక బిడ్డగా మెలిగేవాడని గుర్తుచేసుకున్నారు నటి డిస్కోశాంతి. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించింది. వేణుమాధవ్ తన కార్లో ఎప్పుడూ బియ్యం, పప్పులు, ఉప్పులు వేసుకుని తిరిగేవాడని.. సహాయం కావాల్సిన వారికి డబ్బులు కాకుండా అన్నం పెట్టేవాడని అది అతనిలోని బెస్ట్ క్వాలిటీ అనీ అన్నాడు నటుడు బెనర్జీ. 
  కమెడియన్ కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ ఆస్తులు సంపాదించడమే కాదు ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు. హీరో ఆకాష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజీవ్ కనకాల కూడా వేణుమాధవ్ కి నివాళులు అర్పించారు.

 • Hyper Adhi
  Video Icon

  ENTERTAINMENT26, Sep 2019, 7:36 PM

  కమెడియన్స్ కి స్ఫూర్తి : హైపర్ ఆది, ఏడ్చేసిన శివారెడ్డి (వీడియో)

  నటుడు వేణుమాధవ్ మరణం మిమిక్రీలోకానికి, కమెడియన్స్ కి తీరని లోటని నటుడు శివారెడ్డి, హైపర్ ఆదిలు అన్నారు.నన్నెప్పుడూ శివుడు, శివుడు, శివుడు అనే పిలిచేవాడని గుర్తుచేసుకున్నాడు నటుడు శివారెడ్డి. జబర్దస్త్ కమెడియన్స్ అందరికీ మంచి ఇన్స్ పిరేషన్ వేణుమాధవ్ అని, మూడురోజుల క్రితమే మాట్లాడానని ఇంతలోనే ఈ వార్త అంటూ బాధను వ్యక్తం చేశాడు హైపర్ ఆది.

 • SV Krishna Reddy
  Video Icon

  ENTERTAINMENT26, Sep 2019, 7:26 PM

  మా చేతుల్తో వచ్చాడు, మా కళ్ల ముందే వెళ్లిపోయాడు: ఎస్వీ కృష్ణారెడ్డి (వీడియో)

  వేణుమాధవ్ మృతిపై దర్శకుడు యస్వీకృష్టారెడ్డి, అచ్చిరెడ్డి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తాము ఎంకరేజ్ చేసిన నటుడు తమతో అనుబంధం ఉన్న నటుడు ఇలా అకాలమరణం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఎంకరేజ్ చేద్దామని సంప్రదాయం సినిమాలో అవకాశం ఇచ్చానన్నారు యస్వీ కృష్ణారెడ్డి. కట్టుకున్న ప్రతి ఇంటికి అచ్చివచ్చని క్రిష్ణనిలయం అని పెట్టుకున్నాడంటే అతని కృతజ్ఞతకు నా జోహార్లు అంటూ కంటనీరు పెట్టుకున్నారాయన.స్టార్ కమెడియన్ అయినా అందరితో వినమ్రంగా ఉండేవాడు వేణుమాధవ్. అతనిలోని టాలెంట్ కంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అతన్ని మంచి ఆర్టిస్టును చేసిందన్నాడు అచ్చిరెడ్డి.

 • Paruchuri Gopala Krishna
  Video Icon

  ENTERTAINMENT26, Sep 2019, 7:07 PM

  తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి కుటుంబం తమ ఇంటి సభ్యుడ్ని కోల్పోయిన బాధలో ఉంది (వీడియో)

  వేణుమాధవ్ ను మొదటిసారి రవీంద్రభారతిలో నన్ను ఇమిటేట్ చేస్తుంటే చూశానని గుర్తుచేసుకున్నారు రచయిత పరుచూరిగోపాలకృష్ణ. ఇండస్ట్రీకి వచ్చాక తనని డాడీ అని పిలిచేవాడన్నారు. అభిమానులను, కుటుంబసభ్యులను, ఇండస్ట్రీని శోకసముద్రంలో ముంచి వెళ్లిపోయాడని..వాడి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానన్నాడు రచయిత పరుచూరి గోపాలకృష్ణ.

 • Murali Mohan
  Video Icon

  ENTERTAINMENT26, Sep 2019, 6:58 PM

  పొట్టివాడైనా చాలా గట్టివాడు(వీడియో)

  వేణుమాధవ్ మరణంతో సినిమా ఇండస్ట్రీ అంతా దిగ్భ్రాంతికి లోనయ్యిందన్నారు నటుడు మురళీమోహన్. వేణుమాధవ్ మొదట్లో టిడిపిపార్టీకి పనిచేశారని...ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసేవాడని, కోదాడ నుండి పోటీ పడాలని ప్రయత్నించాడని గుర్తు చేసుకున్నాడు. పొట్టివాడు చిన్నపర్సనాలిటీ అయినా వేణుమాధవ్ చాలా గట్టివాడు అన్నాడు నటుడు మురళీమోహన్.

 • Rajashekar
  Video Icon

  ENTERTAINMENT26, Sep 2019, 6:50 PM

  ఆరోగ్యం విషమించిన సంగతి బైటికి తెలియనివ్వలేదు (వీడియో)

  డయాలసిస్ సమయంలో హార్ట్ ఎటాక్ రావడంతో వేణుమాధవ్ చనిపోయాడని..ఆరోగ్యం బాగై బైటికి వస్తానని అనుకున్నాడు కాబట్టే ఆయన హెల్త్ బాలేని విషయం బైటికి రాలేదని హీరో రాజశేఖర్ అన్నాడు. వేణుమాధవ్ లాంటి గ్రేట్ ఆర్టిస్ట్ కోల్పోవడం తెలుగు ఇండస్ట్రీ దురదృష్టం అన్నాడు.

 • पॉलिटिक्स में भी एक्टिव थे वेणु : वेणु माधव का जन्‍म आंध्र प्रदेश के सूर्यापेट जिले के कोडड गांव में हुआ था। वेणु ने अपने करियर की शुरुआत बतौर मिमिक्री आर्टिस्ट की थी। फिल्मों के अलावा वो पॉलिटिक्स में भी काफी एक्टिव थे। तेलुगु देशम पार्टी (टीडीपी) से वो लगातार जुड़े रहे। पिछले साल तेलंगाना में हुए चुनाव में उन्होंने कोडाड विधानसभा क्षेत्र से चुनाव लड़ने के लिए नॉमिनेशन भी फाइल किया था। हालांकि किन्हीं वजहों से वो चुनाव नहीं लड़ पाए थे।

  ENTERTAINMENT26, Sep 2019, 6:04 PM

  ముగిసిన వేణుమాధవ్ అంత్యక్రియలు

  అనారోగ్యంతో మరణించిన ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ అంత్యక్రియలు ముగిశాయి

 • Raghu Babu
  Video Icon

  ENTERTAINMENT26, Sep 2019, 5:53 PM

  శోక సముద్రంలో హాస్య కుటుంబం : వేణు మాధవ్ కు నివాళులర్పించిన నటుడు రఘుబాబు (వీడియో)

  ఫిల్మ్ చాంబర్ లో ఉంచిన నటుడు వేణుమాధవ్ భౌతిక కాయానికి నటుడు  రఘుబాబు నివాళులర్పించాడు. మనందరి వేణు మనల్ని శోకసముద్రంలో ముంచి వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమ మరో మంచి కమెడియన్ ను కోల్పోయిందన్నారు.
   

 • Maganti Gopinath
  Video Icon

  ENTERTAINMENT26, Sep 2019, 5:46 PM

  మరణాన్ని ఊహించలేకపోతున్నాం : వేణు మాధవ్ కు నివాళులర్పించిన మాగంటి గోపీనాథ్ (వీడియో)

  ఫిల్మ్ చాంబర్ లో ఉంచిన నటుడు వేణుమాధవ్ భౌతిక కాయానికి జూబ్లీహిల్స్ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నివాళులర్పించారు. ఎన్టీఆర్ హయాంలో వెలుగులోకి వచ్చిన హాస్య నటుడని గుర్తుచేసుకున్నారు. కుటుంబానికి సంతాపాన్ని తెలిపారు. ఆయన మరణం ఊహించలేకున్నామని అన్నారు. కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.

 • NagaBabu
  Video Icon

  ENTERTAINMENT26, Sep 2019, 5:40 PM

  ఆత్మకు శాంతి చేకూరాలి : వేణు మాధవ్ కు నివాళులర్పించిన నాగబాబు (వీడియో)

  ఫిల్మ్ చాంబర్ లో ఉంచిన నటుడు వేణుమాధవ్ భౌతిక కాయానికి నటుడు నాగబాబు నివాళులర్పించాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నాడు.

 • Talasani
  Video Icon

  ENTERTAINMENT26, Sep 2019, 5:36 PM

  స్వయంకృషి, పట్టుదలకు కేరాఫ్ అడ్రస్ : వేణు మాధవ్ కు నివాళులర్పించి తలసాని (వీడియో)

  ఫిల్మ్ చాంబర్ లో ఉంచిన నటుడు వేణుమాధవ్ భౌతిక కాయానికి సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు. అన్నగారు స్వర్గీయ ఎన్టీఆర్ ను కూడా తన మిమిక్రీతో ఇమిటేట్ చేసిన ఘనత వేణు మాధవ్ దని కొనియాడారు. షూటింగ్ లో వేణుమాధవ్ ఉంటే సందడే సందడి అని చెప్పారు. స్వయంకృషి, పట్టుదలతో అతితక్కువ కాలంలో అనేక చిత్రాల్లో నటించాడని అన్నారు. ఆయన మృతి పట్ల ప్రగాఢసానుభూతి తెలిపారు.

 • Chirenjeevi
  Video Icon

  ENTERTAINMENT26, Sep 2019, 5:22 PM

  సినిమా నవ్వుకే ఓ విషాదం : వేణు మాధవ్ కి చిరంజీవి నివాళి (వీడియో)

  ఫిల్మ్ చాంబర్ లో ఉంచిన నటుడు వేణు మాధవ్ భౌతిక కాయానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించాడు. వేణుమాధవ్ కుటుంబ సభ్యలును పరామర్శించాడు. మాస్టర్ సినిమానుండి తనతో పాటు అనేక సినిమాలు కలిసి పనిచేశాడని గుర్తుచేసుకున్నాడు. చాలా చిన్నవయసులో మరణించడం తెలుగు సినీ పరిశ్రమకు, హాస్య కుటుంబానికి తీరని లోటని, సినిమా నవ్వుకే ఓ విషాదం అని అన్నారు.