MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Dhandoraa: ఎన్టీఆర్‌ వల్లే రీచ్‌ అయ్యింది.. `దండోరా`కి గద్దర్‌ అవార్డులపై శివాజీ ఎమోషనల్‌ కామెంట్‌

Dhandoraa: ఎన్టీఆర్‌ వల్లే రీచ్‌ అయ్యింది.. `దండోరా`కి గద్దర్‌ అవార్డులపై శివాజీ ఎమోషనల్‌ కామెంట్‌

దండోరా మూవీకి మూడు కేటగిరిలో గద్దర్‌ అవార్డులు వచ్చిన నేపథ్యంలో చిత్ర బృందం స్పందించి ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పింది. నటుడు శివాజీ.. ఎన్టీఆర్‌కి ధన్యవాదాలు తెలిపారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 09 2026, 05:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
దండోరా చిత్రానికి మూడు గద్దర్‌ అవార్డులు
Image Credit : X/@Loukyaoffl

దండోరా చిత్రానికి మూడు గద్దర్‌ అవార్డులు

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘గద్దర్ అవార్డులు 2025’లో ‘దండోరా’ మూవీ సత్తా చాటింది. మూడు కేటగిరీల్లో ‘దండోరా’ అవార్డుల్ని కొల్లగొట్టేసింది. ఉత్తమ ద్వితీయ చిత్రం, ఉత్తమ సహాయ నటుడు(శివాజీ), ఉత్తమ సంగీత దర్శకుడు(మార్క్‌ కే రాబిన్‌) లకు అవార్డులు వరించాయి. ఈ క్రమంలో చిత్ర బృందం తెలంగాణ ప్రభుత్వానికి, జ్యూరీకి థ్యాంక్స్ చెప్పింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో సహాయ నటుడిగా అవార్డు అందుకున్న శివాజీ మాట్లాడుతూ, ఈ మూవీ ఇంతటితో ఆగదని మున్ముందు మరిన్ని అవార్డులను గెలుచుకుంటుందని తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎన్టీఆర్‌కి థ్యాంక్స్ చెప్పిన శివాజీ
Image Credit : Asianet News

ఎన్టీఆర్‌కి థ్యాంక్స్ చెప్పిన శివాజీ

ఆయన మాట్లాడుతూ, ``దండోరా` సినిమాని గుర్తించి అవార్డుల్ని ఇచ్చిన జ్యూరీకి, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది. ఎన్టీఆర్ గారు వేసిన ట్వీట్‌తో తెలుగు వారందరికీ ఈ చిత్రం దగ్గరైంది. మార్క్ కె రాబిన్‌కి అవార్డు రావడం ఆనందంగా ఉంది. నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన బెన్నీకి థాంక్స్. ఈ మూవీ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఈ అవార్డుల్లో భాగం ఉంటుంది. తెలుగు వాళ్ల ప్రతిభను, సత్తాను చాటే చిత్రమిది. మురళీగారు ‘దండోరా’ కథని, మూవీని మా కోసమే తీశాడనిపిస్తుంది. ఈ పాత్ర కోసం, లుక్ కోసం నేను చాలా వరకు రాత్రి పూట రెండు, మూడు గంటలే నిద్రపోయేవాడ్ని. నటన అంటే దైవంతో సమానం. దేవుడుకి నాకు ఆ వరం ఇచ్చాడు. దీంతో ప్రపంచంలో ఎక్కడైనా బతికేస్తాను. రాధ్య అనే పాప పాత్ర లేకపోయి ఉంటే ఈ సినిమా నేను చేసే వాడ్ని కాదు. నవదీప్, నందు, బిందు మాధవి ఇలా అందరూ ఫైనెస్ట్ యాక్టర్స్. వారికి ధన్యవాదాలు` అని తెలిపారు.

Related Articles

Related image1
Top 10 Netflix Movies: ఇండియా వైడ్‌గా దుమ్ములేపుతున్న తెలుగు కామెడీ సినిమా.. నెంబర్‌ 1లో ఉన్న మూవీ ఏంటంటే?
Related image2
Mahesh Babu: బ్లాక్‌ బస్టర్‌ కావాల్సిన మహేష్‌ బాబు సినిమాని డిజాస్టర్‌ చేసిన స్టార్‌ డైరెక్టర్‌.. కోలుకోలేని దెబ్బ
34
ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాం- దర్శకుడు మురళీకాంత్‌
Image Credit : Asianet News

ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాం- దర్శకుడు మురళీకాంత్‌

దర్శకుడు మురళీకాంత్ మాట్లాడుతూ, మా `దండోరా` సినిమాకు ఇలాంటి గుర్తింపు ఇచ్చిన జ్యూరీకి, ప్రభుత్వానికి థాంక్స్. ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన నా టీంలోని ప్రతీ ఒక్కరికీ థాంక్స్. కొత్త దర్శకుడిని అయినా సరే నా టీం అంతా నన్ను నమ్మింది. ఎంతో అనుభవం ఉన్న యాక్టర్స్ సైతం నాకు చాలా సపోర్ట్ చేశారు. మార్క్ కె రాబిన్ మా సినిమాకి ప్రాణం. ఆయన, నేను కలిసి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి సినిమాకు పని చేశాం. ఇలాంటి అవార్డులు, గుర్తింపు వచ్చిన సమయాల్లోనే మన వద్ద ఉన్న టాలెంట్ గురించి అందరికీ తెలుస్తుంది. శివాజీ వల్లే ఈ చిత్రం ఈ స్థాయికి వచ్చింది. ఈ సినిమా చూసి ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్‌లు పర్సనల్‌గా నాకు ఫోన్ చేసి అభినందించారు. ఇలాంటి గుర్తింపు, అవార్డులు వస్తే మరింత మంచి చిత్రాల్ని, సందేశాత్మాక సినిమాల్ని తీయాలనే ప్రోత్సాహం లభిస్తుంది’ అని అన్నారు.

44
ఉత్తమ నిర్మాత కేటగిరి కూడా పెట్టాలి
Image Credit : X/@Loukyaoffl

ఉత్తమ నిర్మాత కేటగిరి కూడా పెట్టాలి

నిర్మాత ర‌వీంద్ర బెన‌ర్జీ మాట్లాడుతూ, `దండోరా` సినిమాని గుర్తించి, అవార్డుల్ని ఇచ్చిన జ్యూరీ మెంబర్లకి, తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్. మా ‘దండోరా’ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా ప్రయాణంలో తోడుగా నిలిచిన సాహు గారికి, నాగవంశీ గారికి థాంక్స్’ అని అన్నారు. సంగీత దర్శకుడు మార్క్ కె రాబిన్ మాట్లాడుతూ, `గద్దర్ అన్న పాటలు చిన్నప్పటి నుంచి వింటూ ఉండేవాడ్ని. ఈ రోజు గద్దర్ అవార్డుల్లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అవార్డ్ రావడం నాకు పెద్ద గౌరవం లాంటిది. ‘దండోరా’ అద్భుతమైన కథ. ఇలాంటి కథను నా వద్దకు తీసుకు వచ్చిన మురళీకి థాంక్స్’ అని అన్నారు. నటుడు నందు మాట్లాడుతూ, `గద్దర్ అవార్డులు సాధించిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్. సినిమాకి అందరూ కలిసి  పని చేస్తేనే ఫలితం వస్తుంది. ఉత్తమ చిత్రం అనే దాంట్లో దర్శకుడు, నిర్మాత కూడా వస్తారు. ఉత్తమ నిర్మాత అనే కేటగిరీని కూడా మున్ముందు పెట్టాలని కోరుకుంటున్నాను` అని అన్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Related Stories
Recommended image1
Top 10 Netflix Movies: ఇండియా వైడ్‌గా దుమ్ములేపుతున్న తెలుగు కామెడీ సినిమా.. నెంబర్‌ 1లో ఉన్న మూవీ ఏంటంటే?
Recommended image2
Mahesh Babu: బ్లాక్‌ బస్టర్‌ కావాల్సిన మహేష్‌ బాబు సినిమాని డిజాస్టర్‌ చేసిన స్టార్‌ డైరెక్టర్‌.. కోలుకోలేని దెబ్బ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved