తలైవి జయలలిత జీవితంపై ఇప్పుడు ఒకటి రెండు కాదు ఏకంగా మూడు బయోపిక్స్ రెడీ అవుతున్నాయి. అమ్మ చనిపోయిన మూడేళ్లకు వరసగా అందరూ సినిమాలు చేస్తున్నారు. అదే సమయంలో అమ్మ జీవితంలో ప్రధాన పాత్ర పోషించిన శోభన్ బాబు పాత్ర ఎవరు వేస్తారనే చర్చ చాలా కాలం జరిగింది. అది ఓ కొలిక్కి వచ్చేలోగా...ఏకంగా శోభన్ బాబు జీవితంపై ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఒక నిర్మాతకు వచ్చింది. వెంటనే ఓ దర్సకుడుతో స్క్రిప్టు రెడీ చేయించారు. శోభన్ కుటుంబ సబ్యులను సైతం ఇందుకు ఒప్పించినట్లు సమాచారం. అయితే అంతా బాగానే ఉంది కానీ శోభన్ బాబు పాత్ర వేసేది ఎవరు అనేది పెద్ద చర్చగా మారింది. ఈ క్రమంలో ఓ తెలుగు హీరో ఇందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. 

అందుతున్న సమాచారం మేరకు శోభన్ బాబు గా రానా అయితే బాగుంటారని సంప్రదించారట. ఆయన కూడా సముఖంగానే ఉన్నారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్టు మరికొద్ది రోజుల్లో సెట్స్ పైకి వెళ్ళనుందని టాక్. ఈ మేరకు రానా నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే  శోభన్  బాబు జీవిత కథతో తెరకెక్కే సినిమాలో రానా అయితే బాగుంటుందని ఆయన అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రానా చేతిలో ఉన్న సినిమాలు  షూటింగ్ చివరి దశలో ఉన్నాయి. 

రానా చేస్తున్న అరణ్య షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది. ఇంకా విరాట పర్వం షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. మరో ప్రక్క భారీ ప్రాజెక్టుగా చెప్పుబడుతున్న గుణ శేఖర్ తో ఉండబోయే హిరణ్య కశ్యప చిత్రం ఇప్పట్లో రాదని తేలిపోయింది. శాకుంతలం అనే సినిమాతో గుణ శేఖర్ బిజీగా ఉండడంతో హిరణ్య కశ్యప పక్కకు తప్పుకున్నట్లే  అంటున్నారు. మరి శోభన్ బాబు జీవిత కథతో తెరకెక్కే సినిమాలో రానా నటిస్తాడా లేదా చూడాలి.