Asianet News TeluguAsianet News Telugu

#Liger:అడ్వాన్స్ బుక్కింగ్స్ తెలుగులో కేక, మరి హిందీలో ?

ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. బాలీవుడ్ డైరక్టర్ కం ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఈ సినిమాని హిందీలో భారీగా రిలీజ్ చేస్తున్నారు.ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా హిందీ వర్షన్ మాత్రం ఒకరోజు ఆలస్యంగా వస్తుందని అంటున్నారు.

What about #Liger Advance Bookings
Author
Mumbai, First Published Aug 22, 2022, 3:04 PM IST

‘లైగర్‌’ (Liger) కుమ్మేస్తది అన్నారు  టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). అదే జరుగుతోంది అనిపిస్తోంది. అతను   హీరోగా నటించిన   పాన్ ఇండియా సినిమా ‘లైగర్‌’ (Liger) . మరో మూడు రోజుల్లో అంటే 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర టీమ్  నాన్ స్టాప్‌గా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. మరో ప్రక్క ఈ చిత్రం అడ్వాన్స్ బుక్కింగ్ లు జోరుగా సాగుతున్నాయి. 20వ తేదీ నుంటి  అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. ఈ మధ్య కాలంలో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతున్న పరిస్థితుల్లో ఈ చిత్రం ఓపినింగ్స్, కలెక్షన్స్ పై అందరి దృష్టీ ఉంది. అయితే ఈ విషయంలో లైగర్‌ మాత్రం దూసుకెళ్తోంది.

ట్రేడ్ ఎక్సపెక్ట్ చేసినట్లే ...తెలుగు వెర్షన్‌కు డిమాండ్‌ బాగా  ఎక్కువగా ఉంది.మొదటి  రోజు అడ్వాన్స్‌ బుకింగ్స్‌ రూపంలో లైగర్‌కు రూ.1.7 కోట్లు వచ్చాయి. ఇందులో చాలా వరకూ తెలుగు వెర్షన్‌ కు సంభందించినవే.  దేశవ్యాప్తంగా మొత్తం 90 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. రిలీజ్‌కు మరో మూడు రోజులు ఉండటంతో ఈ సంఖ్య భారీగా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక హైదరాబాద్‌లో మాత్రం లైగర్‌ హంగామా  ఓ రేంజిలో ఉంది. ఇప్పటికే 15 శాతం షోలు హౌజ్‌ఫుల్‌ కావడం విశేషం. 

చిత్రం టీమ్  దేశమంతా తిరుగుతూ ప్రమోషన్లు బాగానే చేస్తున్నా.. హిందీ బెల్ట్‌లో మాత్రం లైగర్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్ ఆశించిన రేంజ్‌లో లేకపోవటం ఆశ్చర్యంగా ఉంది. అయితే అక్కడ బోయ్ కాట్ లైగర్ ట్రెండ్ నడుస్తోంది. కానీ  ప్రస్తుతం అక్కడ కూడా పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో టాక్ ని కలెక్షన్స్  పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమాతోనే విజయ్‌ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. బాలీవుడ్ డైరక్టర్ కం ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఈ సినిమాని హిందీలో భారీగా రిలీజ్ చేస్తున్నారు.ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా హిందీ వర్షన్ మాత్రం ఒకరోజు ఆలస్యంగా వస్తుందని అంటున్నారు.

 విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ..‘లైగర్‌’.. ‘నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ మూవీ. నా సినిమా మీద నాకు నమ్మకం వచ్చినప్పుడు మీ దగ్గరకు వచ్చి ఎంజాయ్‌ చేయాలనుకున్నాను. కరెక్ట్ టైంలో లైఫ్‌ డ్రామా మొదలయింది. వరుసగా షెడ్యూల్స్‌ ఉండటంతో ఆరోగ్యం సహకరించలేదు. ఈ రోజు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి కారణం మీరు ఇచ్చిన ప్రేమే. ఇక్కడే కాదు, ఇండియాలో ఏ ఊరు వెళ్లినా విపరీతంగా ప్రేమించారు. యాక్టింగ్‌ ఆపేసి, 60ఏళ్లు వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉన్నా కూడా.. ఈ 20 రోజుల్లో జరిగిన ఈవెంట్స్‌, మీ ప్రేమను ఎప్పుడూ మర్చిపోలేను.

 మీరంతా నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఇచ్చారు. ఇప్పుడు నేను తిరిగి మంచి జ్ఞాపకాన్ని ఇవ్వాలి. మీ అందరికీ గుర్తుండిపోయే సినిమాలు ఇవ్వాలనుకున్నా. వాటిలో ఒక అడుగు ‘లైగర్‌’ సినిమా అని నమ్ముతున్నా. ఈ కథ విన్నప్పుడు నేను ఏం చెప్తానా? అని పూరి జగన్నాథ్ (Puri Jagannath), ఛార్మి (Charmy) నావైపు చూశారు. నా నోటి నుంచి వచ్చిన ఒకే ఒక మాట ‘మెంటల్‌’. 

ఈ సినిమాను త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నా. కానీ, మూడేళ్లు పట్టింది. ప్రతి సీన్‌ చేస్తున్నప్పుడు వాటిని చూస్తే నా నోటి నుంచి వచ్చిన ఒకే మాట ‘మెంటల్’. నేను గ్యారెంటీగా చెప్తున్నా సినిమా కుమ్మేస్తది’.. అని అన్నారు. ఇక ఈ సినిమాతో సౌత్ సినిమా ఇండస్ట్రీలకు బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా పరిచయమవుతోంది. ధర్మ ప్రొడక్షన్, పూరి కనెక్ట్స్ కలిసి నిర్మించాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios