విజయ నిర్మల ఫ్యామిలీ నుంచి హీరో.. డైరెక్టర్ వివి వినాయక్ సాయం
విజయ నిర్మలకు మనవడు వరుస అయ్యే యంగ్ హీరో శరన్ కుమార్ టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. శరన్ నటించిన 'సాక్షి' చిత్రం జూలై 21న రిలీజ్ కి రెడీ అవుతోంది.
వరల్డ్ గిన్నిస్ రికార్డ్ విజేతగా, నటిగా, దర్శకురాలిగా విజయనిర్మల తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. సూపర్ స్టార్ కృష్ణ సతీమణిగా ఆమె ప్రయాణం అందరికి తెలిసిందే. ఆమె తనయుడిగా నరేష్ చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. నరేష్ హీరోగా విజయవంతం అయ్యారు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు.
వీరి కుటుంబం నుంచి మూడోతరం నటులు కూడా రెడీ అవుతున్నారు. విజయ నిర్మలకు మనవడు వరుస అయ్యే యంగ్ హీరో శరన్ కుమార్ టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. శరన్ నటించిన 'సాక్షి' చిత్రం జూలై 21న రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వివి వినాయక్ ఈ కార్యక్రమంలో రిలీజ్ డేట్ పోస్టర్ లాంచ్ చేశారు. ఆయన మాట్లాడుతూ ఆర్ యు రెడ్డి, మునగాల సుధాకర్ రెడ్డి కలసి నిర్మించిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి. విజయనిర్మలగారి ఫ్యామిలీ నుంచి హీరో శరన్ వస్తున్నాడు. ప్రేక్షకులు శరన్ ని ఆదరించాలి. శరన్ కి మంచి భవిష్యత్తు ఉండాలి.
సాక్షి చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే విధంగా ఉండబోతోంది. జూలై 21న రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసి ఆదరించండి అని వివి విజయక్ అన్నారు. దర్శకుడు శివకేశవ కుర్తి, డీవోపీ చైతన్యకి మంచి పేరు రావాలని కోరారు.
శరన్ కుమార్ గతంలోనే హీరోగా పరిచయం కావాల్సింది. అయితే రెండేళ్ల క్రితం ఓ ప్రాజెక్టు ప్రారంభమైంది కానీ పూర్తి కాలేదు. ఇప్పుడు మరోసారి శరన్ సాక్షి చిత్రంతో అదృష్టం పరీక్షించుకుంటున్నారు.