ఒక్క పరుగు.. 92 ఏళ్లపాటు చెక్కుచెదరని క్రికెట్ రికార్డు
Unique Cricket Records: డాన్ బ్రాడ్‌మాన్ ఈ రోజు మన మధ్య లేకపోవచ్చు కానీ క్రికెట్ చరిత్రలో పరిచయం అవసరం లేని ఆటగాడు. క్రికెట్ రికార్డు బుక్ తీస్తే అతని పేరు టాప్ లో కనిపిస్తుంది. కెరీర్ లో ఎన్నో క్రికెట్ రికార్డులు సాధించాడు.
Unique Cricket Records: ప్రపంచ క్రకెట్ లో ఎంతో మంది ప్లేయర్లు అనేక రికార్డులు సాధించారు. అందులో కొంత మంది ప్లేయర్లు సాధించిన రికార్డులు చాలా కాలం పాటు ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు. అలాగే, చెత్త రికార్డులతో పాటు అత్యంత బాధకరమైన క్రికెట్ ఘటనలు కూడా ఉన్నాయి. అలాంటి ఒక గొప్ప బాధకరమైన ఇన్నింగ్స్.. 92 ఏళ్ల పాటు చెక్కుచెదరని క్రికెట్ రికార్డును ఆస్ట్రేలియన్ లెజెండరీ ప్లేయర్ డాన్ బ్రాడ్‌మాన్ తన కెరీర్ లో సాధించాడు.
cricket don bradman
ఒక్క పరుగు.. డాన్ బ్రాడ్‌మాన్ ను ఎంతో బాధించింది
క్రికెట్ ప్రపంచంలో చాలా పరుగులు చేసిన డాన్ బ్రాడ్‌మాన్.. క్రికెట్ చరిత్రలో అనేక గొప్ప ఇన్నింగ్స్ లను ఆడి చాలా రికార్డులను సృష్టించాడు. వాటిలో చాలా వరకు నేటికీ బద్దలు కాకుండా ఉన్నాయి. బ్రాడ్‌మాన్ లాంటి ఆటగాడు ఒక మ్యాచ్‌లో 1 పరుగు చేయడం కోసం ఎంతో తహతహలాడాడని మనం చెబితే, ఎవరూ నమ్మరు. కానీ అది జరిగింది. ఆ మ్యాచ్‌లో బ్రాడ్‌మన్ గొప్ప ఇన్నింగ్స్ ను ఆడాడు కానీ, అతనికి ఇది చాలా బాధాకరమైన ఇన్నింగ్స్ గా మారింది.
దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో డాన్ బ్రాడ్‌మాన్ గొప్ప ఇన్నింగ్స్
జనవరి 1932లో, దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. అడిలైడ్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో టాస్ గెలిచిన ఆ జట్టు ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులు చేసింది. కానీ ఆతిథ్య కంగారూలు బ్యాటింగ్‌కు దిగినప్పుడు, కెప్టెన్ ఇన్నింగ్స్ 82 పరుగుల తర్వాత వరుసగా వికెట్లు పడిపోవడం ప్రారంభం అయింది. కానీ డాన్ బ్రాడ్‌మాన్ గోడలా నిలబడి మరో ఎండ్ లో పరుగులు పిండుకున్నాడు.
వికెట్లు పడుతూనే ఉన్నాయి.. డాన్ బ్రాడ్‌మాన్ పరుగులు చేస్తూనే ఉన్నాడు
ఆస్ట్రేలియా జట్టులో వరుస వికెట్లు పడటం ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. క్రీజులో మార్పులేమీ లేకపోయినా చివరి వరకు నిలదొక్కుకున్నాడు డాన్ బ్రాడ్‌మన్. అతన్ని ఔట్ చేయడానికి బౌలర్లు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. బ్రాడ్‌మాన్ మొదట సెంచరీ పూర్తి చేశాడు. తన ఇన్నింగ్స్ ను మరింత ముందుకు తీసుకెళ్తూ.. డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. అంతటితో అతని ఇన్నింగ్స్ ఆగలేదు. ట్రిపుల్ సెంచరీకి చేరువయ్యాడు. ట్రిపుల్ సెంచరీకి కేవలం 1 పరుగుల దూరంలో ఉన్నాడు.
అరంగేట్ర ఆటగాడు స్ట్రైక్ ఇవ్వలేదు.. డాన్ బ్రాడ్‌మాన్ గుండె పగిలింది
299 పరుగుల స్కోరు వద్ద బ్రాడ్‌మన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. జట్టులో చివిరి వికెట్ మాత్రమే మిగిలింది. ఆస్ట్రేలియా తరఫున మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన పుడ్ థర్లో మరో ఎండ్ లో బ్యాటింగ్ చేస్తున్నాడు. పుడ్ థర్లో 13 బంతుల్లో అవకాశం లభించింది కానీ బ్రాడ్‌మన్‌కి ఒక్కసారి కూడా స్ట్రైక్ ఇవ్వలేకపోయాడు. అతను 14 బంతులు ఎదుర్కొన్నాడు. అయితే బ్రాడ్‌మాన్‌ను ట్రిపుల్ సెంచరీ కోసం అతను పరుగు కోసం వెళ్లి రనౌట్ అయ్యాడు. దీంతో బ్రాడ్‌మాన్ ట్రిపుల్ సెంచరీ మిస్ అయింది. కానీ, డాన్ బ్రాడ్ మన్ 299 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్రాడ్‌మన్ ఇన్నింగ్స్ ఆధారంగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 513 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 10 వికెట్ల తేడాతో సులభంగా గెలిచింది. దీంతో క్రికెట్ లో 99 పరుగులు నాటౌట్, 199 నాటౌట్, 299 నాటౌట్ ప్రత్యేక రికార్డు సాధిచిన తొలి ప్లేయర్ గా డాన్ బ్రాడ్‌మాన్ నిలిచాడు.