సోషల్ మీడియా వరల్డ్ లో ప్రస్తుతం ఒక డాగ్ వీడియో వైరల్ గా మారింది. మంచు నేలపై ఒక డాగ్ చేసిన చిన్న రైడ్ నెటిజన్స్ ని ఆకర్షిస్తోంది. ఇక కుక్క స్లిఘ్ రైడ్‌ చూసి సెలబ్రెటీలు కూడా ఫిదా అవుతున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ సీనియర్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ కూడా ఓ కుక్క చేసిన స్లిఘ్ రైడ్‌ పై పాజిటివ్ గా స్పందించి వీడియోను మరీంత వైరల్ చేశాడు.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఒక నెటిజన్ డాగ్ మంచు కురిసిన ఎత్తైన ప్రదేశంలో చలాకీగా స్లిఘ్ రైడ్‌ చేసింది. ఒక మనిషి మాదిరిగానే బోర్డును సొంతంగా సెట్ చేసుకుంటూ ముందుకు సాగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా స్లిఘ్ రైడ్‌ చేయడం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఇక ఆ డాగ్ ని చూసి ఈ కుక్క స్మార్ట్ ఫోన్ కంటే స్మార్ట్ అంటూ చాలా ముద్దుగా ఉందని వివరణ ఇచ్చాడు.