Asianet News TeluguAsianet News Telugu

నోటాపై విమర్శలు.. విజయ్ దేవరకొండ సౌండ్ లేదేంటి?

సాధారణంగా ఒక సినిమా తెరకెక్కించేటప్పుడు వివాదాలకు వీలైనంత దూరంగా ఉండాలని అనుకుంటారు చిత్ర యూనిట్ సభ్యులు. కానీ గత కొంత కాలంగా కాంట్రవర్సీ అయ్యే సినిమాలకు ఓ విధంగా ప్రమోషన్ కూడా వచ్చినట్లు అవుతోంది. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 

why vijay devarakonda not responding on nota comments
Author
Hyderabad, First Published Oct 1, 2018, 5:02 PM IST

సాధారణంగా ఒక సినిమా తెరకెక్కించేటప్పుడు వివాదాలకు వీలైనంత దూరంగా ఉండాలని అనుకుంటారు చిత్ర యూనిట్ సభ్యులు. కానీ గత కొంత కాలంగా కాంట్రవర్సీ అయ్యే సినిమాలకు ఓ విధంగా ప్రమోషన్ కూడా వచ్చినట్లు అవుతోంది. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 

అయితే విమర్శలకు విజయ్ అప్పుడే తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చాడు. బూతు మాటతో ఊహించని విధంగా అందరికి షాక్ ఇచ్చాడు. కామెంట్స్ చేసేవాళ్లకు కౌంటర్లు కూడా బాగానే ఇచ్చాడు. ఇక మొన్న రిలీజై సూపర్ హిట్ గా నిలిచిన గీతగోవిందంపై కూడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. కానీ విజయ్ వాటిని కూడా చాలా ఈజీగా తీసుకొని ప్రమోషన్ లో మిక్స్ చేశాడు. 

ఇక ఇప్పుడు మొదటిసారి నటించిన ద్విభాషా చిత్రం నోటాపై కూడా విమర్శలు వస్తున్నాయి. తెలంగాణాలో ఒక పార్టీకి అనుకూలంగా సినిమాను తెరకెక్కించారని మాజీ సెన్సార్ బోర్డ్ సభ్యులు.సామాజిక కార్యకర్త కెతిరెడ్డి కెతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మీడియా ముందుకు వచ్చి చెబుతున్నారు. 

అదే విధంగా  ప్రస్తుతం తెలంగాణ లో ఉన్న రాజకీయ పరిస్థితుల కారణంగా ఈ చిత్రాన్ని  తెలంగాణా ఎన్నికల కమిషనర్ , డీజీపీ చూసిన అనంతరం విడుదల కు ఆదేశాలు ఇవ్వాలని అన్నారు. నోటా అనే టైటిల్ ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధమని తెలంగాణ సచివాలయంలో ఎన్నికల కమిషనర్ ను కలిసిన తర్వాత తెలంగాణ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడరు.

ఈ విషయం ఇప్పుడిపుడే వైరల్ అవుతోంది. కానీ చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక స్పందించలేదు. విజయ్ నుంచి కూడా పెద్దగా రెస్పాన్స్ లేకపోవడంతో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.   

 

Follow Us:
Download App:
  • android
  • ios