'నోటా' టీఆర్ఎస్ కి సపోర్టా..?
'గీత గోవిందం' సినిమాతో వంద కోట్ల మార్క్ ని టచ్ చేసిన విజయ్ దేవరకొండ సినిమాలపై క్రేజ్ మాములుగా లేదు. అతడు నటించిన 'నోటా' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
'గీత గోవిందం' సినిమాతో వంద కోట్ల మార్క్ ని టచ్ చేసిన విజయ్ దేవరకొండ సినిమాలపై క్రేజ్ మాములుగా లేదు. అతడు నటించిన 'నోటా' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందనుకుంటున్న తరుణంలో ఈ సినిమా రిలీజ్ ని ఆపమని ఎలెక్షన్ కమీషన్ కి లేఖలు రాస్తున్నారు. సామాజిక కార్యకర్తలు.
దీంతో ఇప్పుడు ఈ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది.తెలంగాణాలో టీఆర్ఎస్ పొలిటికల్ పార్టీకి ఫేవర్ గా ఈ సినిమాని రూపొందించారని.. ఎన్నికల నేపధ్యంలో కావాలనే ఈ సినిమాని విడుదల చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు సైతం ఈ వార్తలకి బలాన్ని చేకూరుస్తున్నాయి.
ఆయన చేసిన వ్యాఖ్యలతో టీఆర్ఎస్ కి అనూకూలంగా కొన్ని సన్నివేశాలను ఈ సినిమాలో చూపించారనే అభిప్రాయాలను వ్యక్తమవుతున్నాయి. స్టేట్ ఎలక్షన్ కమీషన్, స్టేట్ గవర్నర్ ఈ సినిమాని చూసి అప్పుడు రిలీజ్ కి అనుమతి ఇవ్వాలని కొందరు కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ మేరకు తెలంగాణా స్టేట్ ఎలక్షన్ కమీషన్ కి, గవర్నర్ కి లేఖలు రాశారు. జనరల్ ఎలక్షన్స్ పూర్తయిన తరువాతే ఈ సినిమాను విడుదల చేయాలని కోరుతున్నారు. ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో ఎలక్షన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ హడావిడి పూర్తయిన తరువాతే సినిమాని విడుదల చేయమని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై చిత్రబృందం ఎలా స్పందిస్తుందో చూడాలి!