టాలీవుడ్ స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న విజయ్ దేవరకొండ అవసరమైనప్పుడు సమాజానికి ఉపయోగపడే విధంగా అందరికి ప్రేరణ కలిగిస్తుంటాడు. అయితే రీసెంట్ గా బియోన్డ్ అకాడమిక్ - తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మొదలైన సే నో టు  డ్రగ్స్  కార్యక్రమంలో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు రౌడీ హీరో. 

డ్రగ్స్ కి బానిసవుతున్న టీనేజర్స్ కి యువతకి సందేశాన్ని ఇచ్చేలా విజయ్ దేవరకొండ చెప్పిన విధానం సోషల్ మీడియాలో ఇప్పుడు నెటిజన్స్ ఆకట్టుకుంటోంది. ఆ వీడియోను యాంకర్ సుమ షేర్ చేశారు. ఇలాంటి మంచి విషయాల్లో పాల్గొంటున్నందుకు విజయ్ ను సుమ ప్రశంసించారు. కింద ఇచ్చిన లింక్స్ లో వీడియో చూడవచ్చు.