Asianet News TeluguAsianet News Telugu

Vijay Antony: ట్రైలర్ ఇంతలా ఉంటే...సినిమా ఏ రేంజిలో ఉంటుందో

‘ప‌ర్‌ఫెక్ట్ మ‌ర్డ‌ర్ అంటూ ఏది ఉండ‌దు. అన్ని మ‌ర్డ‌ర్స్‌లో ఒక లోపం ఉంటుంది’ అంటూ హీరో వాయిస్‌తో ట్రైయిల‌ర్ మొద‌లైంది. ‘ఇండియ‌న్ సెల‌బ్రెటీ మోడ‌ల్ లైలా అనే ఒక యువతి ఓ తాళం వేసిన ఇంట్లో అనుమాస్ప‌ద రీతిలో హ‌త్యకి గుర‌య్యారు’ అంటూ వ‌చ్చే డైలాగ్ సినిమాపై విప‌రీత‌మైన క్యూరియాసిటీని పెంచుతుంది.

Vijay Antony, Ritika Singh Hatya - Official Trailer
Author
Chennai, First Published Aug 16, 2022, 1:07 PM IST


విజయ్‌ ఆంటోనీ హీరోగా నటించిన తాజా చిత్రం ‘హత్య’. బాలాజీ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి, రితికా సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. కమల్‌ బోరా,  జి. ధనుంజయన్, ప్రదీప్‌ .బి, పంకజ్‌ బోరా, విక్రమ్‌ కుమార్, తాన్‌ శ్రీ దొరైసింగమ్‌ పిళ్లై, సిద్ధార్థ్‌ శంకర్, ఆర్వీఎస్‌ అశోక్‌ కుమార్‌ నిర్మించారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ని హీరో నాని సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు.

‘ఇండియ‌న్ సెల‌బ్రెటీ మోడ‌ల్ లైలా అనే ఒక యువతి ఓ తాళం వేసిన ఇంట్లో అనుమాస్ప‌ద రీతిలో హ‌త్యకి గుర‌య్యారు’ అంటూ వ‌చ్చే డైలాగ్ సినిమాపై విప‌రీత‌మైన క్యూరియాసిటీని పెంచుతుంది. ఈ చిత్రంలో విజ‌య్ ఆంటోని డిటెక్టీవ్‌గా న‌టించాడు. ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే సినిమా గ్రాండియ‌ర్‌గా రూపొందిన‌ట్లు తెలుస్తుంది. విజువ‌ల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ థ్రిల్ ఫీల్‌ను క‌లిగిస్తున్నాయి. ట్రైల‌ర్ చివ‌ర్లో ‘నేను పుట్టాను, బ‌తికాను. కానీ ఏదో సాధించాల‌నుకునేలోపే న‌న్ను చంపేశారు. ఎవ‌రు చంపారో, ఎందుకు చంపారో, ఎలా చంపారో మీకు తెలియాలంటే నేనెవ‌రో ముందు మీరు తెలుసుకోవాలి’ అంటూ వ‌చ్చిన డైలాగ్ సినిమాపై అంచనాల‌ను అమాంతం పెంచింది.

 ‘‘హత్య నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. వేరే భాష నుంచి వచ్చినా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు విజయ్‌ ఆంటోనీ. ‘‘ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ మూవీ ఇది. లైలా అనే అమ్మాయి హత్య చుట్టూ ఈ కథ నడుస్తుంది’’ అన్నారు బాలాజీ కుమార్‌. ‘‘త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు నిర్మాతలు.

లోటస్ పిక్చర్స్ తో కలిసి ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి కమల్ బోరా- జి.ధనుంజయన్- ప్రదీప్ బి- పంకజ్ బోరా- విక్రమ్ కుమార్- తాన్ శ్రీ దొరైసింగమ్ పిల్లై- సిద్ధార్థ్ శంకర్- ఆర్వీఎస్ అశోక్ కుమార్ నిర్మాతలు కాగా బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను హీరో నాని సోషల్ మీడియా ద్వారా విడుదల చేయగా.. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో సందడిగా ప్రెస్ మీట్ నిర్వహించారు. మూవీ త్వరలో థియేటర్లలోకి వస్తోంది కాబట్టి రిజల్ట్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios