అల్లు అర్జున్, త్రివిక్రమ్ లది సూపర్ హిట్ కాంబినేషన్.వీరిద్దరి కాంబోలో ఇదివరకే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి చిత్రాలు వచ్చాయి. దీనితో హ్యాట్రిక్ చిత్రంగా తెరకెక్కుతున్న అల వైకుంఠపురములోపై మంచి అంచనాలు ఉన్నాయి. 

ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో ఓ విషయాన్ని ప్రకటించాడు. తన కుటుంబం కొత్త ఇంటిని నిర్మించుకుంటున్న సంగతిని అభిమానులతో పంచుకున్నాడు. కొత్త ఇంటికి నేడే భూమి పూజ జరిగింది. 

ఆ ఇంటికి బన్నీ నామకరణం కూడా చేశాడు. తన ఇంటికి 'బ్లెస్సింగ్' అని పేరు పెట్టినట్లు అల్లు అర్జున్ పేర్కొన్నాడు. తన పిల్లలు, సతీమణి స్నేహతో కలసి పునాదిరాయి వేస్తున్న ఫోటోని అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 

సినిమాల విషయానికి వస్తే అలా వైకుంఠపురములో చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత బన్నీ సుకుమార్ దర్శత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

BLESSING

A post shared by Allu Arjun (@alluarjunonline) on Oct 2, 2019 at 11:20pm PDT