తన తొలి సినిమా 'బాణం' దగ్గర నుండి ఇప్పటివరకు హీరో నారా రోహిత్ వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. కొత్త దర్శకులకి అవకాశాలు ఇస్తూ.. చిత్రనిర్మాణంలో భాగమవుతూ కొత్త ప్రయత్నాలను ప్రోత్సహిస్తుంటాడు.

అయితే రోహిత్ చేసిన కొన్ని ప్రయత్నాలు బాక్సాఫీస్ వద్ద ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. తాజాగా ఆయన మరో ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీవిష్ణు, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'వీరభోగ వసంత రాయలు'. 

ఇంద్రసేన ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాను అప్పారావు బెల్లాన నిర్మించారు. అయితే ఈ సినిమాపై ట్విట్టర్ లో మిశ్రమ స్పందన వస్తోంది. కథ చాలా బాగుందని, వినూత్నమైన థ్రిల్లర్ తో దర్శకుడు అలరించారని కొందరు ట్వీట్లు చేస్తున్నారు.

స్క్రీన్ ప్లే బాగుందని, శ్రీవిష్ణు క్యారెక్ట రైజేషన్ అధ్బుతంగా ఉందని అంటున్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి కథలు పేపర్ మీద రాయడానికి మాత్రమే బాగుంటాయని తెరపై చూడలేమని ట్వీట్ చేస్తున్నారు. 

కథ బాగున్నా దర్శకుడు నేరేట్ చేసిన విధానం తలనొప్పి తెప్పించిందని అంటున్నారు. ఇలా కొందరు సినిమా బాగుందని అంటుంటే మరికొందరు మాత్రం బాగాలేదని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 

 

ఇవి కూడా చదవండి.. 

'వీరభోగ వసంతరాయలు' ప్రీమియర్ టాక్!

సుధీర్ బాబు హర్ట్ అవడానికి అసలు కారణం ఇదేనా?

నారా వారబ్బాయి.. ఇలా అయితే కష్టమే?

ప్రణయ్ కోసం సినిమా పాట!

రామెజిఫిల్మ్ సిటి లో సుధీర్‌బాబు పాత్ర‌తో ప్రారంభ‌మైన 'వీర భోగ వ‌సంత రాయ‌లు' షూటింగ్‌

గుండు,టాటూలు కాదు.. సింపుల్ లుక్ తో ఆకట్టుకున్నాడు!