ఈ మధ్యకాలంలో 'వీరభోగ వసంతరాయలు' సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది. దానికి కారణం సినిమా టీజర్, ట్రైలర్లు. స్టార్ కాస్ట్ లేకపోయినా.. తెలుగు తెరపై కొత్త సందడి చేయడం ఖాయమని అంతా అనుకున్నారు. 

ఈ సినిమా కథొక మిస్టరీ అని, థియేటర్లోకి జనాలు ఎగబడడం ఖాయమని భావించారు. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రమాదకరమని తేల్చేశారు ఓవర్సీస్ ఆడియన్స్. అసలు విషయంలోకి వస్తే.. సాధారణంగా తెలుగు సినిమాలు ఓవర్సీస్ లో కొద్ది గంటల ముందే రిలీజ్ అవుతాయి. 

కానీ సినిమా యూనిట్ అందుకు భిన్నంగా ఏకంగా రెండు రోజుల ముందు అమెరికాలో ప్రీమియర్స్ వేశారు. అదే వీరికి పెద్ద దెబ్బ అని చెప్పాలి. ప్రయోగం వికటించిందని, సినిమా బాగాలేదనే టాక్ బయటకి వచ్చేసింది. 

అక్కడ క్రిటిక్స్ సినిమాకి బ్యాడ్ రివ్యూస్ ఇచ్చారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు ముందే వీరభోగ వసంతరాయలు సినిమాపై నెగెటివ్ టాక్ వచ్చేసింది. దీని ప్రభావం ఈరోజు విడుదలవుతున్న ఈ సినిమాపై ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. మరి ప్రజలు ఈ సినిమాను ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి!

ఇవి కూడా చదవండి.. 

సుధీర్ బాబు హర్ట్ అవడానికి అసలు కారణం ఇదేనా?

నారా వారబ్బాయి.. ఇలా అయితే కష్టమే?

ప్రణయ్ కోసం సినిమా పాట!

రామెజిఫిల్మ్ సిటి లో సుధీర్‌బాబు పాత్ర‌తో ప్రారంభ‌మైన 'వీర భోగ వ‌సంత రాయ‌లు' షూటింగ్‌

గుండు,టాటూలు కాదు.. సింపుల్ లుక్ తో ఆకట్టుకున్నాడు!