బ్యాక్ గ్రౌండ్ ఎంత ఉన్నా సినిమాల్లో స్టార్ డమ్ తెచ్చుకోవాలంటే అంత ఈజీ కాదు. ఎంత కష్టపడినా కొన్నిసార్లు వర్కౌట్ కాకపోవచ్చు. అవకాశాలు ఎన్ని వచ్చినా ప్రేక్షకులను మెప్పించకపోతే వాల్యూ ఉండదు. నారా వారబ్బాయి పరిస్థితి ఇప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు చేసిన ఈ యువహీరో అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయాడు. 

ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు పదేళ్లవుతోంది. 20 సినిమాల వరకు చేశాడు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తే సిల్వర్ జూబ్లీ కూడా చేసుకోవచ్చు. బాణం - సోలో అలాగే రౌడీ ఫెలో తప్పితే అతనికి పెద్దగా సక్సెస్ లు లేవు. రోహిత్ చేసిన ప్రయోగాత్మక చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయో గాని బయ్యర్స్ కి నిర్మాతలకు ఎంతవరకు లాభాలని ఇచ్చాయో వారికే తెలియాలి. 

ఇప్పుడు రానున్న వీరభోగ వసంత రాయలుకు కూడా పెద్దగా బజ్ లేకపోవడం గమనార్హం. మల్టీస్టారర్ కథ అయినప్పటికీ ఓపెనింగ్స్ పై పెద్దగా నమ్మకం లేదు. నారా రోహిత్ చేస్తున్న ప్రయోగాలకు అప్పుడప్పుడు బాలకృష్ణ కూడా హెల్ప్ చేస్తున్నాడు. తారక్ - కళ్యాణ్ రామ్ సినిమాల ఈవెంట్స్ కి కూడా ఎక్కువగా రాని బాలయ్య నారా రోహిత్ కోసమని వచ్చాడు. 

ఆ విధంగా కూడా నారా రోహిత్ బిగ్గెస్ట్ హిట్స్ అందుకోలేకపోయాడు. ఇప్పుడున్న కుర్ర హీరోలు నెమ్మదిగా సినిమాలు చేస్తున్నా కూడా ఎదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నారు. అయితే నారావారబ్బాయి కూడా కథలో మార్పులు చేస్తున్నాడే గాని తన పాత్రలకు సంబందించిన బాడీ లాగ్వేజ్ ను మార్చుకోలేపావుతున్నాడు. ప్రతి సినిమాలో దాదాపు ఒకే తరహా స్టైల్ లో కనిపిస్తున్నాడు. ఇలా అయితే నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడం నారావారబ్బాయికి కష్టమనే చెప్పాలి.