గుండు,టాటూలు కాదు.. సింపుల్ లుక్ తో ఆకట్టుకున్నాడు!

srivishnu look from veera bhoga vasantharayulu
Highlights

శ్రీవిష్ణు లుక్ బయటకు వస్తుందని అతడు గుండు, శరీరమంతా టాటూలతో కనిపిస్తాడని అన్నారు. కానీ దానికి భిన్నంగా చాలా కూల్ గా కనిపిస్తున్నాడు శ్రీవిష్ణు. సినిమాలో అతడి ఫస్ట్ లుక్ పోస్టర్ ను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశాడు శ్రీవిష్ణు

థ్రిల్లర్ కథాంశంతో దర్శకుడు ఇంద్రసేన తెరకెక్కిస్తోన్న చిత్రం 'వీర భోగ వసంతరాయులు'. నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్ బాబు హీరోలుగా నటిస్తున్నారు. మినీ మల్టీస్టారర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో శ్రియ కూడా కనిపించబోతుంది. రీసెంట్ గా సినిమాలో శ్రియ, నారా రోహిత్ ల లుక్స్ ను విడుదల చేసింది చిత్రబృందం. శ్రియ డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో సరికొత్త లుక్ తో దర్శనమివ్వగా, నారా రోహిత్ ఒక చెయ్యికి కట్టుతో సీరియస్ లుక్ తో కనిపించాడు.

ఈ ఇద్దరి తరువాత శ్రీవిష్ణు లుక్ బయటకు వస్తుందని అతడు గుండు, శరీరమంతా టాటూలతో కనిపిస్తాడని అన్నారు. కానీ దానికి భిన్నంగా చాలా కూల్ గా కనిపిస్తున్నాడు శ్రీవిష్ణు. సినిమాలో అతడి ఫస్ట్ లుక్ పోస్టర్ ను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశాడు శ్రీవిష్ణు. గుర్రంతో పాటు నడిచొస్తున్న శ్రీవిష్ణు లుక్ చాలా సింపుల్ గా ఉంది. ఈ పాత్ర కోసం తన జుట్టుని బాగా పెంచినట్లు ఉన్నాడు ఈ హీరో. లాంగ్ హెయిర్ తో కనిపిస్తున్నాడు.

అప్పారావు బెల్లన నిర్మిస్తోన్న ఈ సినిమాను ప్రయోగాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి కాన్సెప్ట్ రాలేదని మేకర్స్ చాలా నమ్మకంగా చెబుతున్నారు.

 

loader