టాలీవుడ్ లో కొత్త కొత్త కాంబినేషన్స్ కు అంకురార్పణ జరుగుతోంది. క్రేజీగా ఉంటే ప్రాజెక్టుల వైపే హీరోలు మ్రొగ్గు చూపెడుతున్నారు. అలాంటి ఓ చిత్రమైన కాంబినేషన్ తో ఓ చిత్రం తెలుగులో రూపొందబోతోంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దర్శకుడు క్రిష్ నిర్మాణంలో...సురేంద్రరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. అలాగే ఈ స్క్రిప్టుకు మరో దర్శక,రచయిత వక్కంతం వంశీ పనిచేస్తున్నారు. ఇలా ముగ్గురు డైరక్టర్స్ ఒకే ప్రాజెక్టుపై పనిచేయటం గొప్ప విషయమే. ఇంతకీ ఈ సినిమాలో హీరో ఎవరంటే వరుణ్ తేజ్.

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు కథని క్రిష్ అందిస్తూ నిర్మిస్తున్నారు. స్క్రిప్టుని వక్కంతం వంశీ పర్యవేక్షణ,స్క్రీన్ ప్లే తో గత కొద్ది రోజులుగా రూపొందిస్తున్నారు. సురేంద్రరెడ్డి, వక్కంతం వంశీ కాంబోలో గతంలో పెద్ద హిట్స్ వచ్చాయి. ఈ నేపధ్యంలో ఈ ప్రాజెక్టుపై ఖచ్చితంగా క్రేజ్ ఏర్పడనుంది. తమ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ట్నైమెంట్స్ బ్యానర్ పై ..క్రిష్ సైతం భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఈ సినిమాని నిర్మించబోతున్నట్లు వినికిడి. సైరా తర్వాత సురేంద్రరెడ్డి చేయబోతున్న సినిమా ఇదే. ప్రస్తుతం స్క్క్రిప్టు వర్క్ ఫైనల్ స్టేజిలలో ఉంది. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉంది. 

ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ తన ఛరిష్మాను సొమ్ము చేసుకునే పనిలో పడ్డాడు. లేటెస్ట్ గా నాగార్జున సిమెంట్స్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని నాగార్జున సిమెంట్స్ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలో ఎక్కువ సేల్ సిమెంట్ బ్రాండ్లలో నాగార్జున సిమెంట్ కూడా ఒకటి.