మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటిస్తున్న సైరా చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో సైరా చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇదిలా ఉండగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశస్థులు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. 

తాజాగా చిరంజీవి, రాంచరణ్ పై ఉయ్యాలవాడ కుటుంబీకులు కేసు కూడా నమోదు చేశారు. సైరా చిత్రం కోసం ఉయ్యాలవాడ గురించి విలువైన సమాచారని చిత్ర యూనిట్ తమ నుంచి తెలుసుకుంది. తమకు డబ్బు ఇస్తామని చిరంజీవి హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం తమని వారు పట్టించుకోవడం లేదు అంటూ ఉయ్యాలవాడ కుటుంబీకులు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో చిరు, చరణ్ పై కేసు నమోదు చేశారు. తమకు 50 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా నేడు జరగబోతున్న సైరా ప్రీరిలీజ్ ఈవెంట్ పై కూడా బెదిరింపులకు దిగారు. తమకు న్యాయం చేయకుంటే ప్రీరిలీజ్ ఈవెంట్ ని అడ్డుకుంటాం అని ఉయ్యాలవాడ కుటుంబీకులు హెచ్చరించారు. ఈ సాయంత్రం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రీరిలీజ్ వేడుక జరగనుంది.

సైరా వివాదం: రామ్ చరణ్, చిరంజీవిలపై పోలీసులకు ఫిర్యాదు

నేడే సైరా ప్రీరిలీజ్ వేడుక.. అందరి దృష్టి వీళ్లపైనే!

సైరా ఫస్ట్ సాంగ్.. రిలీజ్ ఎప్పుడంటే?