హైదరాబాద్: సైరా వివాదం మరో మలుపు తీసుకుంది. హీరో చిరంజీవి, నిర్మాత రామ్ చరణ్ తేజ్ లపై ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వంశీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైరా సినిమా కథ విషయయంలో తమతో ఒప్పందం చేసుకని, మోసం చేశారని వారు హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

నరసింహా రెడ్డి కథను తమ నుంచి తీసుకుని, తిరిగి తమపైనే తప్పుడు కేసులు పెట్టారని వారు ఆరోపిం్చారు. కథను తీసుకున్నందుకు డబ్బులు ఇస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేశారని వారు ఆ ఫిర్యాదు ఆరోపించారు. 

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ జీవితం ఆధారంగా సైరాను తెరకెక్కించిన విషయం తెలిసింేద. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్ చరణ్ ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిపాబు ఈ సినిమాలో ముఖ్య భూమికలు పోషించారు. 

అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ వీడుదలైంది. ఆదివారంనాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది.