మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన సాంగ్స్ ఎప్పుడు వస్తాయా అని ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ తో ఒక్కసారిగా సినిమాపై అంచనాల డోస్ పెంచిన చిత్ర యూనిట్ సాంగ్స్ తో మరింత బజ్ క్రియేట్ చేయడానికి సిద్ధమైంది. 

ఇక ఫైనల్ ఆదివారం రాత్రి 9గంటలకు సినిమా లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. ఆ సాంగ్ టైటిల్ ట్రాక్ అని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కొణిదెల ప్రొడక్షన్ లో దాదాపు 250కోట్ల బడ్జెట్ తో నిర్మించిన  సైరా చిత్రం మెగాస్టార్ కెరీర్ లొనే అత్యధిక మార్కెట్ రేట్ ను అందుకున్నట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ లో కూడా సినిమా బిజినెస్ సాలీడ్ గా ఉంది. 

మెగాస్టార్ గత సినిమాలకంటే సైరా ఓవర్సీస్ లో అత్యధిక ధరకు అమ్ముడైనట్లు సమాచారం. అమెరికాలో అక్టోబర్ 1న సినిమా ప్రీమియర్స్ ని ప్రదర్శించనున్నారు. ప్రీమియర్స్ ద్వారా కూడా మెగాస్టార్ మూవీ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. మరి రేపు జరగబోయే ప్రీ రిలీజ్ వేడుకతో అభిమానుల్లో ఎలాంటి అంచనాలను రేపుతారో చూడాలి.