టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొని తెలుగు, తమిళ భాషల్లో దూసుకుపోతున్న నటి రకుల్ ప్రీత్ సింగ్ ను అమెరికా సెక్స్ రాకెట్ వివాదానికి సంబంధించిన అధికారులు ఆమెను ప్రశ్నించబోతున్నారని సమాచారం. అసలు విషయంలోకి వస్తే.. అమెరికాలో టాలీవుడ్ నటీమణుల సెక్స్ రాకెట్ సంగతి బయటపడిన తరువాత ప్రముఖంగా ఆరుగురు నటీమణుల పేర్లు వినిపించాయి. 

ఇప్పటికే అధికారులు వారిని విచారించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు మరికొందరు తారలను యుఎస్ అథారిటీస్ టార్గెట్ చేసినట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా కొందరు టాలీవుడ్ హీరోయిన్లను ప్రశ్నించాలని అధికారులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఓ లిస్ట్ కూడా రెడీ చేశారు. అందులో భాగంగా యాంకర్ అనసూయను ప్రశ్నించారు. ఇప్పుడు ఆ లిస్టులో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉందని సమాచారం.

ఈవెంట్ల పేరిట విదేశాలకు వెళ్లే తారల జాబితాను సేకరించి వాళ్లను విచారించబోతున్నారు. ఇండస్ట్రీకు చెందిన కొందరు చేసిన తప్పుల కారణంగా అందరినీ దోషులుగా చూడడం సరికాదని హీరోయిన్లు బాధ పడుతున్నారు. ఇటీవల మెహ్రీన్ కూడా ఇటువంటి పరిస్థితినే అమెరికాలో ఎదుర్కోవాల్సివచ్చింది. ఇప్పుడు రకుల్ కూడా ఇలాంటి సిట్యుయేషన్ ను ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి ఈ లిస్టులో ఇంకెంతమంది తారలు ఉన్నారో చూడాలి!