మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యల విషయం అలానే బాలకృష్ణల గురించి నాగబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇది ఇలా ఉండగా నాగబాబుని మహేష్ గురించి ఒక్క లైన్ లో చెప్పమని కోరాడు ఓ అభిమాని. దీనికి సమాధానంగా నాగబాబు.. మహేష్ గురించి ఒక్క మాటలో ఏంటి ఎంతసేపైనా మాట్లాడొచ్చని అన్నారు.

''తమ్ముడు పవన్ కళ్యాణ్ కి సమానమైన క్రేజ్ ఉన్న వ్యక్తి మహేష్ బాబు. వివాదాలకు పూర్తిగా దూరంగా ఉంటాడు. తండ్రి వారసత్వానికి తగ్గట్లుగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నా భార్య వయసున్న వారు మహేష్ ని తమ్ముడిలా భావిస్తారు.

ఇక ఈ తరం అమ్మాయిలకు మహేష్ డ్రీమ్ బాయ్. ప్రిన్స్ అనే పదానికి అర్హుడాయన'' అంటూ చెప్పుకొచ్చాడు. మహేష్ పై నాగబాబు ప్రశంసల వర్షం కురిపించడంతో ఆయన అభిమానులు మురిసిపోతున్నారు. నాగబాబుకి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు చెబుతున్నారు. 

పవన్ మూడు పెళ్లిళ్లు.. నాగబాబు ఏం అంటున్నాడంటే..?