ఏపీలో రాజకీయాలు వేడెక్కిన నేపధ్యంలో నటుడు నాగబాబు చేస్తోన్న కామెంట్స్ మరిన్ని వివాదాలకు దారి తీస్తున్నాయి. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబు.. బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని షాక్ ఇచ్చాడు. టీడీపీ పార్టీని రెచ్చగొట్టడానికే నాగబాబు ఈ విధమైన కామెంట్స్ చేశాడని తెలుస్తోంది.

తాజాగా వివాదాస్పదమైన పవన్ మూడు పెళ్లిళ్ల గురించి నాగబాబు కొన్ని కామెంట్స్ చేశారు. ''పవన్ వ్యక్తిగత జీవితం గురించి నేను మాట్లాడడం సరియైనదా..? కాదా..? అనే విషయం నాకు తెలియదు. కానీ ఈ విషయంపై నా అభిప్రాయం చెప్తాను. కళ్యాణ్ మొదట ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయితో తనకు సరిపడలేదు. మర్యాదపూర్వకంగా ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.

చట్టపరంగా ఇద్దరూ విడిపోయారు. ఆ తరువాత రేణుదేశాయ్ తో ఒక అండర్ స్టాండింగ్ ఏర్పడింది. కొంతకాలం కలిసున్న తరువాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వారి మధ్య ఎలాంటి మనస్పర్ధలు వచ్చాయో తెలియదు కానీ ఉమ్మడి అంగీకారంతోనే విడిపోయారు. ఈ ఇద్దరు అమ్మాయిలను నేను విమర్శించను. ఎందుకంటే వాళ్లు ఆడపిల్లలు. ఆ ఇద్దరూ మా కుటుంబంతో పెద్దగా కలిసేవారు కాదు. 

ఎందుకో సెపరేట్ గా ఉండేవారు. ఇక ఇప్పుడున్న రష్యన్ జాతికి చెందినదైనా.. భారతీయ సంప్రదాయాలను గౌరవిస్తుంది. ఆమెను చూస్తే ముచ్చటేస్తుంది. చిరంజీవి అన్నయ్య దగ్గర నుండి మా కుటుంబంలో అందరూ ఆమెను ఇష్టపడతారు. కళ్యాణ్ బాబుకి మంచి అమ్మాయి దొరికిందనేది నా అభిప్రాయం'' అంటూ చెప్పుకొచ్చాడు.