అదినేను కాదు.. నేనెక్కడికి పారిపోలేదు.. డ్రగ్స్ కేసుపై హీరో నవదీప్ క్లారిటీ..
టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కేస్ కలకలం రేగింది. ఈసారి ఏకంగా హీరో నవదీప్ డ్రగ్స్ కేసులో పరారీలో ఉన్నాడంటూ.. ఏకంగా సిటీ పోలీస్ కమీషనర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ.. నవదీప్ పై ఆరోపణ చేయడంతో.. ఆయననే స్వయంగా స్పందించారు.

టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కేసు ప్రకంపనలు మొదలయ్యాయి. ఈకేసు విషయయంలో ఇప్పటికే ముగ్గురు నైజీరియాన్ లతో పాటు ఒక మూవీ ప్రొడ్యూసర్ , పొలిటీషియల్ కొడుకుని కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. గుడిమల్కాపూర్ పోలీసులతో కలిసి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జరిపిన ఆపరేషన్ లో భాగంగా వీళ్లంతా బయటబడ్డారు. ఇక ఈ విషయంలో కొంత మంది సినిమా తారల పేర్లు కూడా బయటకు వచ్చాయి. దానికి సబంధించిన విషయాలను తాజాగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సిపి ఆనంద్ మీడియాకు కూడా వెల్లడించారు.
ఆయన మాట్లాడుతూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా టాలీవుడ్ హీరో.. నవదీప్ కు కూడా ఈ డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉందని, అతను కూడా డ్రగ్స్ తీసుకున్నాడు అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. అంతే కాదు. ప్రస్తుతం నవదీప్ కానీ అతని కుటుంబం కాని అందుబాటులో లేదని, ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకుని కుటుంబంతో సహా పరారయ్యారు అని తెలిపారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో నవదీప్ పై వార్తలు వైరల్ అవ్వడంతో తాజగా హీరో నవదీప్ తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
ఈ విషయంపై స్పందించిన ఆయన ట్వీట్ చేస్తూ.. చిన్న సెటైర్ కూడా వేశాడు. ఈ మేరకు నవదీప్ ట్వీట్ చేస్తూ.. జెంటిల్మెన్ అది నేను కాదు.. నేను ఇకడే ఉన్నాను.. ఎక్కడికి పారిపోలేదు.. అసలు దానితో నాకు సబంధం లేదు దయచేసి క్లారిటీ తెచ్చుకోండి, థాంక్స్" అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు నవదీప్. ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు నవదీప్.. తాను ఎక్కడికి పారిపోలేదని, హైదరాబాదులోని ఉన్నానని, డ్రగ్స్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. తాను కూడా ప్రెస్ మీట్ చూశానని కమిషనర్ హీరో నవదీప్ అని ఎక్కడా మెన్షన్ చేయలేదని, అతను వేరే నవదీప్ అయి ఉంటాడని యంగ్ హీరో క్లారిటీ ఇచ్చాడు.
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నవదీప్ కెరీర్ ప్రస్తుతం అంత ఆశాజనకంగా లేదు. హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నవదీప్.. ఆతరువాత క్యారెక్టర్ రోల్స్ వైపు టర్న్ అయ్యాడు. హీరోగా సినిమాలు చేస్తూనే..పెద్ద పెద్ద స్టార్స్ సినిమాల్లో సెకండ్ హీరోగా నటిస్తున్నాడు. అంతే కాదు మరో వైపు వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల నవదీప్ లీడ్ రోల్ లో నటించిన 'న్యూసెన్స్' అనే వెబ్ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.