Asianet News TeluguAsianet News Telugu

“ఏజెంట్” మ్యూజిక్ డైరెక్టర్ మార్పు ?తమన్ ని వద్దనుకోవటానికి రీజన్

ముందుగా ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తాడని ప్రకటించిన మేకర్స్ ఆయన స్థానంలో ఇప్పుడు మరో మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకున్నారని తెలుస్తోంది. 

Thaman opts out of Akhils Agent
Author
Hyderabad, First Published Sep 2, 2021, 11:46 AM IST

యంగ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతన్న తాజా చిత్రం “అఖిల్”.  ఈ సినిమాకు సంగీత దర్శకుడు మారుతున్నాడని వార్తలు వస్తున్నాయి. ముందుగా ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తాడని ప్రకటించిన మేకర్స్ ఆయన స్థానంలో ఇప్పుడు మరో మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇంతకీ ఆ కొత్త సంగీత దర్సకుడు ఎవరూ అంటే...ఎందుకు తమన్ ని వద్దనుకున్నారు అంటే..

 తమన్ ప్రస్తుతం తన కెరీర్‌లో పీక్స్ లో ఉన్నారు. ఆయన ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కలిపి డజనుకు పైగా భారీ బడ్జెట్ ప్రాజెక్టులకు స్వరాలు సమకూరుస్తున్నారు. అందులో ” ఏజెంట్” కూడా ఉంది. అయితే తమన్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమాకు అందుబాటులో లేరని తెలుస్తోంది. ఈ కారణంగానే ప్రాజెక్టుకు లేటయ్యేటట్లు ఉందని,  మేకర్స్ మ్యూజిక్ కంపోజర్‌ను మార్చారని టాక్.

 “ఏజెంట్” కోసం హిప్‌హాప్ తమిజాను రంగంలోకి తీసుకువచ్చారట. హిప్‌హాప్ తమిజా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సెషన్ లో పని చేయడం ప్రారంభించాడని అంటున్నారు. ఏజెంట్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. సురేందర్ రెడ్డి ఈ ఏడాది చివరిలోపు షూట్ పూర్తి చేసి “ఏజెంట్”ను తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నాడు. 

ఈ స్పై థ్రిల్లర్ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని సరసన హీరోయిన్ గా సాక్షి వైద్య నటిస్తోంది. ఈ చిత్రం 2021 డిసెంబర్ 24న విడుదల కానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios