కరోనా ప్రతి ఒక్కరినీ భయపెడుతోంది. కానీ, సినిమా వాళ్లు మాత్రం షూటింగ్ లు మొదలెట్టేసారు. మెదట్లో కొద్దిగా వెనకడుగు వేసినా ఇప్పుడు ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ ..షూటింగ్ లకు హాజరు అవటానికి రెడీ అవుతున్నారు. అదే విధంగా తమన్నా కూడా ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి షూటింగ్ లో  పాల్గొంటోంది. ఈ నేపధ్యంలో తమన్నా కరోనా బారిన పడ్డారు. హైఫీవర్‌తో బాధపడుతున్న తమన్నా ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. 

ఆ సమయంలో నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్లు తేలింది. అయితే ఇన్‌ఫెక్షన్ ఎంత ఉందన్న విషయం ఇవాళ తెలియనున్నట్లు సమాచారం.కాగా ఆ మధ్యన తమన్నా తల్లిదండ్రులకు కరోనా సోకగా.. వారిద్దరు కోలుకున్నారు. ఇక సినిమా షూటింగ్‌ కోసం మిల్కీబ్యూటీ ఇటీవల హైదరాబాద్‌ రాగా ఆమెకు వైరస్ నిర్ధారణ అయ్యింది. 

కాగా ప్రస్తుతం తమన్నా చేతిలో గుర్తుందా శీతాకాలం, సిటీమార్, అంధధూన్ రీమేక్‌తో‌ పాటు ఓ వెబ్‌ సిరీస్ ఉన్నాయి. ఇందులో సిటీమార్ చిత్రం నవంబర్  నుంచి పునః ప్రారంభం కావాల్సి ఉంది.