మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా ట్రైలర్ రిలీవుజ్ కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగుళూరు, చెన్నై లాంటి ప్రాంతాల్లో కూడా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ట్రైలర్ ఆకట్టుకోవడంతో వారి సంతోషాలకు అవధులు లేకుండా ఉంది. 

అభిమానులంతా సైరా ట్రైలర్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు, బెంగుళూరులో కూడా సైరా ట్రైలర్ ని పలు థియేటర్స్ లో ప్రదర్శించారు. దీని కోసం మంగళవారం నుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

మెగా అభిమానులు ట్రైలర్ ప్రదర్శించే థియేటర్స్ వద్దకు బుధవారం మధ్యాహ్నం నుంచే చేరుకొని హంగామా మొదలు పెట్టారు. అన్ని థియేటర్స్ లో అభిమానుల కోసం సైరా ట్రైలర్ ని ఉచితంగా ప్రదర్శించారు. టికెట్లకు అమౌంట్ విధించినా చెల్లించి ట్రైలర్ చూసే పరిస్థితి కనిపించింది. 

కానీ అభిమానులు ఉత్సాహాన్ని గమనించి బెంగుళూరులో ట్రైలర్ టిక్కెట్లని రూ 100కు విక్రయించారు. అయినా అభిమానులు వెనుకాడకుండా టికెట్ కొనుక్కుని థియేటర్ లో ట్రైలర్ చూశారు. ట్రైలర్ కు కూడా టికెట్ డబ్బులు వసూలు చేయడం ఏంటంటూ సదరు డిస్ట్రిబ్యూటర్ పై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో డిస్ట్రిబ్యూటర్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. 

సైరా ట్రైలర్ లో ఇది గమనించారా.. చిరు 'జలస్తంభన విద్య'!

దయచేసి ఆ సీన్ ట్రైలర్ లో చూపించొద్దు.. వేడుకుంటున్న మెగా ఫ్యాన్స్!

'సైరా' ప్రీరిలీజ్ బిజినెస్.. దిల్ రాజు సహా ఎవరెవరంటే!

బాంబులా పేలిన 'సైరా' డిజిటిల్ రైట్స్ ధర.. వామ్మో ఇంతా!

మెగా ఫ్యాన్స్ లో కలవరం.. వెనుకబడ్డ 'సైరా' ప్రమోషన్స్

బాహుబలిని మించిపోయిన 'సైరా'!

మెగాస్టార్ ఉగ్రరూపం.. థియేటర్లలో సైరా ట్రైలర్!

అఫీషియల్: 'సైరా' ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా.. కారణం ఇదే!