Asianet News TeluguAsianet News Telugu

సైరా ప్రీరిలీజ్: 41 ఏళ్ల తర్వాత టెన్షన్ పడుతున్నా..రాజమౌళికి హ్యాట్సాఫ్.. చిరంజీవి!

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్ర ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో వైభవంగా జరుగుతోంది. ప్రీరిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్, రాజమౌళి, కొరటాల శివ, వివి వినాయక్ లాంటి ప్రముఖులు హాజరవుతున్నారు. 

SyeRaa prerelease event Chiranjeevi speech
Author
Hyderabad, First Published Sep 22, 2019, 10:32 PM IST

ప్రీరిలీజ్ ఈవెంట్ కు వచ్చిన అభిమానులకు, అతిథులకు అభినందనలు తెలియజేస్తూ చిరంజీవి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. నా రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు అంటూ పవన్ గురించి చిరు ప్రత్యేకంగా మాట్లాడారు. నా మొదటి చిత్రం సెప్టెంబర్ 22న విడుదలయింది. ఆ చిత్ర విడుదల సమయంలో చాలా టెన్షన్ పడ్డా.  41 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే విధంగా టెన్షన్ పడుతున్నా. అందుకు కారణం సైరా చిత్రం. 

దశాబ్దానికి పైగా నా మదిలో ఉన్న కల ఈ చిత్రం. సైరా కన్నా ముందు భగత్ సింగ్ చిత్రంలో నటించాలని అనుకున్నా. కానీ ఆ కథ ఎప్పుడూ నావద్దకు రాలేదు. కానీ సైరా రూపంలో స్వాతంత్ర ఉద్యమం ఉన్న కథలో నటించే అవకాశం వచ్చింది. చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ, మహాత్మా గాంధీ వరకు చాలా మంది గొప్పవారి కథలు మనకు తెలుసు. కానీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి చాలా మందికి తెలియదు. మన తెలుగు వీరుడి గురించి అందరికి తెలియాలని భావించా. 

మొదట్లో బడ్జెట్ ఇబ్బందులు ఎదురయ్యాయి. ఐన కూడా ఈ చిత్రాన్ని ఎలాగైనా తెరకెక్కించాలి అని అనుకున్నా.అలాంటి సమయంలో ఈ చిత్రం ప్రారంభం కావడానికి పరోక్షంగా కారణమైన వ్యక్తి రాజమౌళి. రాజమౌళి బాహుబలి చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం వల్లే మాకు ధైర్యం వచ్చింది. రాజమౌళికి హ్యాట్సాఫ్. 

మంచి దర్శకుడి కోసం వెతుకుతున్న సమయంలో రాంచరణ్ సురేందర్ రెడ్డి పేరు చెప్పాడు. వెంటనే సురేందర్ రెడ్డిని పిలిచి విషయం చెప్పా. ఎగిరి గంతేస్తాడని అనుకున్నా. కానీ చాలా సింపుల్ గా నాకు కొంచెం టైం కావాలి సర్ అని అన్నాడు. పది రోజుల తర్వాత వచ్చి ఒకే చేస్తాను అని అన్నాడు.అసలు ఎందుకు టైం కావాలని అన్నావు అని అడిగా. 

ఇది ఓ పక్క చిరంజీవి నటించే సినిమా.. మరోపక్కా ఉయ్యాలవాడ కథ. అందుకే ఆలోచించుకోవడానికి సమయం అడిగా అని అన్నాడు. ఇప్పుడు సినిమా తీసేందుకు రెడీ అంటూ ముందుకు వచ్చాడు. అలా సైరా చిత్రం ప్రారంభమైందని చిరంజీవి తన ప్రసంగంలో పేర్కొన్నాడు. 

సినిమాకు వాయిస్ ఓవర్ పవన్ కల్యాణే చెప్పాలని ముందు నుంచి అనుకుంటున్నా. కళ్యాణ్ చెబితే యువతకు బాగా రీచ్ అవుతుంది. ఈ విషయం పవన్ కు చెప్పగానే నిమిషం కూడా ఆలోచించలేదు.. వెంటనే అంగీకరించాడు. సినిమా ఆరంభంలో చివర్లో పవన్ వాయిస్ ఉంటుంది. ప్రతి ఒక్కరిని ఆలోచించే విధంగా పవన్ మాటలు ఉంటాయి అని చిరంజీవి అన్నారు. 

సైరా ప్రీరిలీజ్: రాజమౌళి గారు గెలిస్తే సంతోషించే వ్యక్తిని..పవన్ పవర్ ఫుల్ స్పీచ్!

సైరా ప్రీరిలీజ్ ఈవెంట్: మగధీరలో చిరంజీవి గారు తానే హీరో అనుకుని.. రాజమౌళి!

సైరా ప్రీరిలీజ్: తండ్రి నిర్మాణంలో నటించే కొడుకులు ఉన్నారు కానీ..

సైరా ప్రీరిలీజ్: చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా ఆయన రుణం తీర్చలేను!

సైరా ప్రీరిలీజ్: జాతి కోసం యుద్ధం చేస్తే అది చరిత్ర.. పరుచూరి!

సైరా ప్రీరిలీజ్ ఈవెంట్: రామ్ లక్ష్మణ్ వచ్చేశారు.. జనసంద్రంలా ఎల్బీ స్టేడియం!

 

Follow Us:
Download App:
  • android
  • ios