సైరా ప్రీరిలీజ్ వేడుకలో ప్రత్యేక అతిథిగా హాజరైన దర్శకధీరుడు రాజమౌళి మాట్లాడుతూ.. సైరా గురించి మాట్లాడే ముందు ముందుగా కృతజ్ఞతలు చెప్పాల్సింది పరుచూరి బ్రదర్స్ కి. వాళ్ళ గుండెల్లో ఈ కథని దాదాపు 20 ఏళ్ల పాటు మోశారు.  విషయం నాకు తెలుసు. 

ఈ చిత్రంతో రాంచరణ్ కేవలం చిరంజీవి గారికి మాత్రమే గిఫ్ట్ ఇవ్వడం లేదు.. తెలుగు ప్రజలందరికి ఇస్తున్నాడు. ఈ చిత్రంలో దాదాపు 3800 విఎఫెక్స్ షాట్స్ ఉన్నట్లు కనల్ కణ్ణన్ నాతో చెప్పారు. ఇంతటి భారీ చిత్రాన్ని తెరకెక్కించడం ఎంత కష్టమో నాకు తెలుసు. సురేందర్ రెడ్డిగారు సైరా చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. 

చిరంజీవి గురించి మాట్లాడుతూ.. చిరంజీవి గారిని నేను మగధీరలో ఓ సన్నివేశంలో మాత్రమే డైరెక్ట్ చేశాను. ఆ చిత్ర స్టోరీ సిట్టింగ్స్ లో మాతో పాటు చిరంజీవి గారు చాలా రోజులు కూర్చున్నారు. తనకు అనిపించిన సూచనలు ఇచ్చారు. అప్పుడు నాకు అనిపించింది. మగధీర చిత్రంలో ఈయన చరణ్ ని హీరోగా ఊహించుకోవడం లేదు.. తనని తానే హీరోగా ఊహించుకుంటున్నారు అని రాజమౌళి సరదాగా వ్యాఖ్యానించారు. 

ఇప్పుడు కురిసియింది వర్షం కాదు.. పై నుంచి ఉయ్యాలవాడ నరసింహాసరెడ్డి గారు సైరా యూనిట్ పై అక్షింతలు వేశారు అంటూ రాజమౌళి తన ప్రసంగాన్ని ముగించారు. 

సైరా ప్రీరిలీజ్: తండ్రి నిర్మాణంలో నటించే కొడుకులు ఉన్నారు కానీ..

సైరా ప్రీరిలీజ్: చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా ఆయన రుణం తీర్చలేను!

సైరా ప్రీరిలీజ్: జాతి కోసం యుద్ధం చేస్తే అది చరిత్ర.. పరుచూరి!

సైరా ప్రీరిలీజ్ ఈవెంట్: రామ్ లక్ష్మణ్ వచ్చేశారు.. జనసంద్రంలా ఎల్బీ స్టేడియం!