పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ.. నేను ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయినప్పుడు ధైర్యం ఇచ్చింది అన్నయ్య చిరంజీవి గారే. ఆయన లాంటి అన్నయ్య అందరికి ఉండి ఉంటే తెలంగాణాలో విద్యార్థులు మరణించే వారు కాదు. నాకు ధైర్యం చెప్పిన మా వదిన కూడా ఇక్కడకి వచ్చారు. 

ఒక అన్నయ్య కంటే వ్యక్తిగా చిరంజీవి గారు అంటే నాకు చ గౌరవం. ఆయనకు చెడు చేయాలని భావించినా అందరి మంచి కోరే వ్యక్తి. నాకన్నా చిన్నవాడైన రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉంది. చరణ్ నా కళ్ళముందే పుట్టి పెరిగాడు. చిరంజీవి గారు ఎలాంటి సినిమాల్లో నటించాలని అనుకున్నానో అలంటి చిత్రాన్ని చరణ్ నిర్మించాడు. 

మన భారతదేశం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి వ్యక్తుల సమూహం. మనపైన అందరూ దాడి చేశారు కానీ భారతీయులు ఎప్పుడూ ఏ దేశం పైనా దాడి చేయలేదు. నరసింహారెడ్డి ఎలా బ్రిటిష్ వారితో పోరాడారో మనకు తెలియదు. ఆయన పోరాటాన్ని దృశ్యరూపంలో చూపించేదే ఈ చిత్రం అని పవన్ అన్నారు. 

పరుచూరి బ్రదర్స్ ఎన్నో ఏళ్లుగా ఈ చిత్ర కథపై పనిచేశారు. సైరా భారత దేశం గర్వించదగ్గ చిత్రం. నటుడిగా మరకముందు శుభలేఖ చిత్రానికి నా గళం వినిపించా. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత సైరా చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చా అని పవన్ తెలిపాడు. 

తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి గారు ఇక్కడకు రావడం సంతోషం. రాజమౌళి గారు గెలిస్తే సంతోషించే వ్యక్తిని. మన తెలుగువాళ్లు ఎవరు గెలిచినా మనం సంతోషించాలి అని పవన్ కళ్యాణ్ తెలిపారు.