Asianet News TeluguAsianet News Telugu

సైరా ప్రీరిలీజ్: చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా ఆయన రుణం తీర్చలేను!

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్ర ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో వైభవంగా జరుగుతోంది. ప్రీరిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్, రాజమౌళి, కొరటాల శివ, వివి వినాయక్ లాంటి ప్రముఖులు హాజరవుతున్నారు. 

SyeRaa prerelease event Prudhvi Raj speech
Author
Hyderabad, First Published Sep 22, 2019, 8:15 PM IST

ప్రీరిలీజ్ ఈవెంట్ లో కమెడియన్ 30 ఇండస్ట్రీ పృథ్వి రాజ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా చిరంజీవి గారి రుణం తీర్చుకోలేను అని పృథ్వి తెలిపాడు. ఈ జన్మ మొత్తానికి గుర్తుండిపోయే పాత్ర ఈ చిత్రంలో చేశాను. నా పాత్ర ఇంటర్వెల్ లో చాలా కీలకం. 

నరసింహ స్వామి మళ్ళీ పుట్టాడు దొరా అనే ఎమోషనల్ డైలాగ్ తనకు ఉందని పృథ్వి తెలిపాడు. సైరా రికార్డులు క్రియేట్ చేస్తుంది. నా పాత్రని బట్టే చెప్పొచ్చు ఈ చిత్రం ఏ రేంజ్ లో ఉండబోతోందో అని పృథ్వి అన్నాడు. 

రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ మెగాస్టార్ కత్తితో నరికే సన్నివేశం ఉంది. అలా ఆయన రికార్డులని తెగనరకడానికి వస్తున్నారు. ఈ చిత్రంలో మేము ఎమోషనల్ గా సాగే ఫైట్స్ చేశాం అని రామ్ లక్ష్మణ్ తెలిపారు. 

సైరా ప్రీరిలీజ్: జాతి కోసం యుద్ధం చేస్తే అది చరిత్ర.. పరుచూరి!

సైరా ప్రీరిలీజ్ ఈవెంట్: రామ్ లక్ష్మణ్ వచ్చేశారు.. జనసంద్రంలా ఎల్బీ స్టేడియం!

Follow Us:
Download App:
  • android
  • ios