- Home
- Entertainment
- Gaddar Film Awards List: ఉత్తమ నటిగా రష్మిక, ఉత్తమ నటుడు నాగచైతన్య.. రాజు వెడ్స్ రాంబాయికి అవార్డుల పంట
Gaddar Film Awards List: ఉత్తమ నటిగా రష్మిక, ఉత్తమ నటుడు నాగచైతన్య.. రాజు వెడ్స్ రాంబాయికి అవార్డుల పంట
తెలంగాణ గద్దర్ అవార్డుల్లో రష్మిక మందన్నా ఉత్తమ నటిగా ఎంపికైంది. ఉత్తమ నటుడిగా నాగచైతన్యకి అవార్డు వరించింది. అలాగే యదార్థ సంఘటనల ఆధారంగా వచ్చిన `రాజు వెడ్స్ రాంబాయి`కి అవార్డుల పంట పండింది.

rashmika mandanna, naga chaitanya
2025లో విడుదలైన సినిమాలకు సంబంధించి గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రకటన వచ్చింది. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులు 2025 ని తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మెన్ దిల్ రాజు ప్రకటించారు ఇందులో ఉత్తమ నటిగా రష్మిక మందన్నా ఎంపికైంది. ఉత్తమ నటుడిగా నాగచైతన్యకి అవార్డు వరించింది. అలాగే తెలంగాణ ఫిల్మ్ రాజు వెడ్స్ రాంబాయికి అవార్డుల పంట పండింది. దీనికి నాలుగు అవార్డులు రావడం విశేషం. మరోవైపు `ది ఫ్రీ వెడ్డింగ్ షో`, `ఛాంపియన్`, `తండేల్` మూవీస్‌కి అవార్డులు వరించాయి.
2025 తెలంగాణ "గద్దర్ " చలన చిత్ర అవార్డుల జాబితా
ఉత్తమ నటుడు - నాగ చైతన్య (తండేల్)
ఉత్తమ నటి - రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్)
ఉత్తమ చిత్రం - రాజు వెడ్స్ రాంబాయి
ఉత్తమ ద్వితీయ చిత్రం - దండోరా
ఉత్తమ తృతీయ చిత్రం - ది ప్రీ వెడ్డింగ్ షో
నేషనల్ ఇంటిగ్రిటీ సినిమా - తండేల్
ఉత్తమ పర్యావరణ చిత్రం - ఇగ్వా
ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ - లిటిల్ హార్డ్స్
ఉత్తమ వినోదాత్మక చిత్రం - సంక్రాంతికి వస్తున్నాం
ఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం - కోర్టు
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ మూవీ - మిరాయ్
ఉత్తమ బాలల చిత్రం - అనగనగనా
ఉత్తమ దర్శకుడు - సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ సపోర్టింగ్ నటుడు - శివాజీ
ఉత్తమ సపోర్టింగ్ నటి- భూమిక
2025 తెలంగాణ "గద్దర్ " చలన చిత్ర అవార్డుల జాబితా
ఉత్తమ సంగీత దర్శకుడు - మార్క్ కె రాబిన్ (దండోరా)
ఉత్తమ నేపథ్య గాయకుడు - అనురాగ్ (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ నేపథ్య గాయని - సాహితి చాగంటి (కన్నప్ప)
ఉత్తమ హాస్యనటుడు - కృష్ణ తేజ (జిగ్రీస్)
ఉత్తమ బాలనటుడు - రోహన్ రాయ్ (ప్రీ వెడ్డింగ్ షో)
ఉత్తమ కథా రచయిత - గుణశేఖర్ (యుఫోరియా)
ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ - అనిల్ రావిపూడి
ఉత్తమ గేయ రచయిత - నందకిశోర్ (కుబేర)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్)
ఉత్తమ ఎడిటర్- శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్)
ఉత్తమ ఆడియోగ్రాఫర్ - ఎం.ఆర్ రాధాకృష్ణన్ కిష్కిందపురి
ఉత్తమ కొరియోగ్రాఫర్ - గిర గిర గిర
ఉత్తమ ఆర్ట్ డైరక్టర్ - తోట తరణి ఛాంపియన్
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ - గోవింద్ అఖండ
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ - చాంపియన్ - చంద్రకాంత్
ఉత్తమ స్పెషల్ జ్యూరీ ఫిల్మ్ - 23
ఉత్తమ మేల్ యాక్టర్ - చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ నటి - అనంతిక (8 వసంతాలు)
స్పెషల్ జ్యూరీ హీరో - రోషన్ (చాంపియన్)

