Asianet News TeluguAsianet News Telugu

సైరా ప్రీమియర్ షోలు.. అప్పుడే టికెట్ల అమ్మకాలు!

తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాంచరణ్ నిర్మిస్తున్నారు. 

syeraa premier shows in america
Author
Hyderabad, First Published Sep 18, 2019, 12:42 PM IST

చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం 'సైరా'. ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది.ఈరోజు సాయంత్రం 5:31ని.లకు సినిమా ట్రైలర్ ని విడుదల చేయనున్నారు. 

దీంతో సోషల్ మీడియాలో అభిమానుల సంబరాలు మొదలయ్యాయి. ట్రైలర్ ని థియేటర్స్ లో ప్రత్యేకంగా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ కి మరో ఇరవై రోజుల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే సినిమా ప్రీమియర్ షోలను ప్లాన్ చేస్తున్నారు. 

అమెరికా లాంటి దేశాల్లో సినిమా ప్రీమియర్ షోల కోసం ఇప్పటికే థియేటర్లను ఫైనల్ చేశారు. సినీలాంజ్, ఫ్రెమొంట్ వంటి థియేటర్లలో ప్రీమియర్ షోల కోసం బుకింగ్స్ మొదలయ్యాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

కాగా స్వాతంత్రసమరయోధుడు  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, రవి కిషన్, సుదీప్, తమన్నా, నిహారిక, అనుష్క తదితరులు కీలక పాత్రలలో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు. 

'సైరా' కోసం రూల్స్ బ్రేక్ చేస్తోందా..? 

అఫీషియల్: 'సైరా' ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా.. కారణం ఇదే!

మెగాస్టార్ ఉగ్రరూపం.. థియేటర్లలో సైరా ట్రైలర్!

సైరా మానియా: ఫ్యాన్స్ ఎదురుచూపులకు నాలుగు కారణాలివే...

బాహుబలిని మించిపోయిన 'సైరా'!

'సైరా' ప్రీరిలీజ్ బిజినెస్.. దిల్ రాజు సహా ఎవరెవరంటే!

సైరా కొత్త లుక్.. మాస్ మెగాస్టార్ తో ఆ ఇద్దరు.. తమిళ హీరో ట్వీట్!

Follow Us:
Download App:
  • android
  • ios