చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం 'సైరా'. ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ఈ సినిమాలో చిరు సరసన నయనతార హీరోయిన్ గా కనిపించనుంది. 

ఈ సినిమా కోసం అమ్మడుకి దాదాపు ఆరు కోట్ల పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. సాధారణంగా నయనతార తన సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనదు. సినిమా సైన్ చేసినప్పుడే ఆ విషయాన్ని చెప్పి అగ్రిమెంట్ చేసుకుంటుంది. ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగిందట.

కానీ మెగాస్టార్ కోసం తన రూల్స్ బ్రేక్ చేసుకొని సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనాలని నిర్ణయించుకుందట. సెట్స్ మీద మెగాస్టార్ ప్రొఫెషనలిజం, తనను ట్రీట్ చేసిన విధానం నయన్ కి ఎంతగానో నచ్చాయట. అందుకే చిరు అడగడంతో ప్రమోషన్స్ లో పాల్గొంటానని చెప్పినట్లు సమాచారం. ముంబై, చెన్నైలలో జరగనున్న సినిమా 'సైరా' ఈవెంట్ లో నయనతార పాల్గొననుందని చెబుతున్నారు.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. కాగా స్వాతంత్రసమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, రవి కిషన్, సుదీప్, తమన్నా, నిహారిక, అనుష్క తదితరులు కీలక పాత్రలలో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు.