సైరా మానియా: ఫ్యాన్స్ ఎదురుచూపులకు నాలుగు కారణాలివే...

First Published 17, Sep 2019, 4:35 PM IST

సైరా నరసింహారెడ్డి సినిమా ట్రైలర్ కోసం ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారిని గనుక మీరు సైరా సినిమా ట్రైలర్ కోసం ఎందుకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ఒక 4 కారణాలు చెప్పండి అని అడిగితే వారు తడుముకోకుండా చెప్పే సమాధానం 

1. మెగాస్టార్ చిరంజీవి 

2.  మెగాస్టార్ చిరంజీవి 

3.  మెగాస్టార్ చిరంజీవి 

4.  మెగాస్టార్ చిరంజీవి 

ఫ్యాన్స్ విషయం కొద్దిసేపు పక్కనపెట్టి అసలు సైరా ఇంత క్రేజ్ ని క్రియేట్  చెయ్యడానికి గల 4 కారణాలను మనమూ ఒక లుక్కేద్దాం.

1. మెగాస్టార్ చిరంజీవి  150వ సినిమా ఖైదీ విడుదలైన తరువాత చాల కాలం గ్యాప్ తరువాత ఈ సినిమా తెరమీదకు వస్తుంది. దానికి తోడు ఇది మెగాస్టార్  డ్రీమ్ ప్రాజెక్ట్. 12 సంవత్సరాల కల ఈ ప్రాజెక్ట్. 65 సంవత్సరాల వయసులోనూ కుర్రహీరోలకు ఏమాత్రం తీసిపోకుండా చిరు బాక్స్ ఆఫీస్ యుద్ధానికి సైరా  అంటున్నాడు.

2. వి ఎఫ్ ఎక్స్ (గ్రాఫిక్స్):  దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కు పెద్దపీట వేశారు. ఈ వి ఎఫ్ ఎక్స్ విషయంలో బాహుబలి-2 రికార్డులను సైరా చెరిపేసింది. బాహుబలి-2లో 2400 వి ఎఫ్ ఎక్స్ షాట్స్ ను వినియోగిస్తే సైరా లో వాటికన్నా 1000 ఎక్కువగా వినియోగించారు. ఈ చిత్రంలోని నీటి అంతర్భాగంలో జరిగే యాక్షన్ సీక్వెన్స్ లో వాడిన గ్రాఫిక్స్ సినిమాకే హైలైట్ గా చెబుతున్నారు. ఈ 3400 వి ఎఫ్ ఎక్స్ షాట్స్ ను సినిమాలో అందంగా చూపెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా 17 స్టూడియోలో రేయనకా పగలనకా టెక్నిషియన్స్ కష్టపడుతున్నారు.

3. ప్రపంచానికి తెలియని అన్ సంగ్ హీరో :  భారతదేశ స్వతంత్ర సంగ్రామం అంటే మనకు కేవలం కొద్దిమంది పేర్లు మాత్రమే గుర్తుకువస్తాయి. కానీ మన తెలుగునేలపై తెల్లదొరల పెత్తనాన్ని అల్లూరి సీతారామరాజు కన్నా ముందే ఒక యోధుడు ప్రశ్నించాడని, వారిని ఎదిరించి పోరాడి వీరమరణం పొందాడని మనలో ఎంతమందికి తెలుసు? అలాంటి ఒక రేనాటి చోళుని వీరగాథను మన తెలుగువారితో సహా భారత దేశానికి పరిచయం చేస్తున్నారు.

4. యాక్షన్ సెక్వెన్సులు:  చిరంజీవి సినిమా అంటేనే ఫ్యాన్స్ ముందుగా చెప్పుకునేది, మాట్లాడుకునేది యాక్షన్ సన్నివేశాల గురించే. అదీ ఇలాంటి చారిత్రక సినిమాలో, యుద్ధమే ప్రధాన భూమిక పోషించనున్న సినిమాలో యాక్షన్ సీన్ల గురించి ప్రత్యేకించి చెప్పాలా! ఈ సినిమా కోసం హాలీవుడ్ నుంచి స్టంట్ కొరియోగ్రాఫర్ ని ప్రత్యేకంగా పిలిపించారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-6, స్కైఫాల్, హ్యారిపోర్టర్ వంటి చిత్రాలకు పనిచేసిన గ్రెగ్ పావెల్ సైరా సినిమాకు స్టంట్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించనున్నాడు.

ఇవే కాకుండా ఇంకా చాలా ప్రత్యేకతలు కూడా సైరా లో ఉన్నాయి. చిరంజీవి అంటేనే డాన్స్. కానీ ఈ సినిమాలో డాన్స్ నంబర్లకు స్కోప్ లేదు. ఒక చిరంజీవి సినిమా డాన్స్ నంబర్లు లేకుండా మొదటిసారి ఇలా మనముందుకు వస్తుంది. పాన్ ఇండియా లెవెల్ లో ఇంత భారీ స్థాయిలో ఇన్ని భాషల్లో ఒకేసారి విడుదలవుతున్న తొలి చిరంజీవి సినిమా కూడా ఇదే.

loader