మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. సైరా చిత్రం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బుధవారం రోజు ట్రైలర్ విడుదల కానున్న నేపథ్యంలో అభిమానుల హంగామా మొదలయింది. 

తాజాగా సైరా చిత్రంలోని కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఖడ్గం చేతబట్టి ఉగ్ర రూపంతో ఉన్న నరసింహారెడ్డిగా చిరంజీవి కనిపిస్తున్నాడు. చిరుకు ఇరువైపులా విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ ఉన్నారు. ఈ పోస్టర్ అభిమానులని ఏంతగానో ఆకట్టుకుంటోంది. 

సైరా చిత్రాన్ని తమిళనాడు వ్యాప్తంగా స్టార్ ప్రొడ్యూసర్ ఆర్ బి చౌదరి తన సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ చిత్ర యూనిట్ ఈ పోస్టర్ ని రిలీజ్ చేసింది. సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ తో అసోసియేట్ కావడం సైరాకు కలసి వచ్చే అంశమే. 

ఆర్బీ చౌదరి తనయుడు, యువ హీరో అయిన జీవ కూడా సైరా గురించి ట్వీట్ చేశాడు. సైరా విడుదల సందర్భంగా తన తండ్రికి శుభాకాంక్షలు తెలిపాడు. 

 

'సైరా' ప్రీరిలీజ్ బిజినెస్.. దిల్ రాజు సహా ఎవరెవరంటే!

బాంబులా పేలిన 'సైరా' డిజిటిల్ రైట్స్ ధర.. వామ్మో ఇంతా!

మెగా ఫ్యాన్స్ లో కలవరం.. వెనుకబడ్డ 'సైరా' ప్రమోషన్స్

బాహుబలిని మించిపోయిన 'సైరా'!

మెగాస్టార్ ఉగ్రరూపం.. థియేటర్లలో సైరా ట్రైలర్!

అఫీషియల్: 'సైరా' ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా.. కారణం ఇదే!