MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Balakrishna: ఎన్టీఆర్‌ని చూసి వణికిపోయే బాలకృష్ణ ఈ ఒక్క విషయంలో తండ్రినే ఎదురించాడు.. దెబ్బకి లైఫ్‌ సెట్‌

Balakrishna: ఎన్టీఆర్‌ని చూసి వణికిపోయే బాలకృష్ణ ఈ ఒక్క విషయంలో తండ్రినే ఎదురించాడు.. దెబ్బకి లైఫ్‌ సెట్‌

ఎన్టీఆర్‌ అంటే ఆయన కుమారులకు భయం. బాలకృష్ణ కూడా వణికిపోయేవారట. కానీ ఒక్క విషయంలో మాత్రం తండ్రిని నిర్ణయాన్ని వ్యతిరేకించాడు బాలయ్య. అది ఆయన జీవితాన్నే మార్చేసింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 09 2026, 12:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఎన్టీఆర్‌ వారసుడిగా రాణిస్తోన్న బాలయ్య
Image Credit : our own

ఎన్టీఆర్‌ వారసుడిగా రాణిస్తోన్న బాలయ్య

విశ్వనట సార్వభౌముడు నందమూరి తారక రామారావు.. సినిమా రంగంలో నందమూరి ఫ్యామిలీ చెట్టుకు బీజం వేశారు. ఆయన నటకాల నుంచి సినిమాల్లోకి వెళ్లారు. అదరగొట్టారు. తెలుగు సినిమా దశదిశని మార్చేశాడు. లెజెండరీ నటుడిగా నిలిచిపోయారు. తెలుగు సినిమా గర్వించే స్థాయికి ఎదగడంలో ఆయన పాత్ర ఎంతో ఉందని చెప్పొచ్చు. ఆయన నట వారసులుగా బాలకృష్ణ, హరికృష్ణ వంటి వారు సినిమాల్లోకి వచ్చారు. ఒక్క బాలయ్య మాత్రమే సక్సెస్‌ అయ్యారు. ఆ తర్వాత జూ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌, తారకరత్న వంటి వారు వచ్చారు. తారక్‌, కళ్యాణ్‌ రామ్‌లు హీరోలుగా రాణిస్తున్నారు. ఇప్పుడు మరో తరం హీరోలు రాబోతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
తండ్రి ఎన్టీఆర్‌ అంటే బాలయ్యకి భయం
Image Credit : X/Balakrishna

తండ్రి ఎన్టీఆర్‌ అంటే బాలయ్యకి భయం

ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌ ఫ్యామిలీలో ఆయనంటే వారి పిల్లలందరికీ భయం. ఆయనకు ఎదురెళ్లే సాహసం ఎవరూ చేయరు. ఒక్క హరికృష్ణ తప్ప. ఇప్పుడు తనదైన స్టయిల్‌లో అందరిని భయపెట్టే బాలకృష్ణ కూడా తండ్రి ఎన్టీఆర్‌కి భయపడేవారు. ఈ విషయాన్ని బాలయ్యనే చెప్పారు.   ఆయన కూతురు నారా బ్రహ్మాణి కూడా చెప్పారు. కానీ బాలయ్య ఒక్క విషయంలో మాత్రం తండ్రిని ఎదురించాడు. దీంతో ఆయన నిర్ణయం, ఆయన తెగింపు ఇప్పుడు బాలయ్య జీవితాన్నే మార్చేసింది.  

34
తండ్రిని ఎదురించిన బాలయ్య, లైఫే మారిపోయింది
Image Credit : Face book/Nandamuri Balakrishna

తండ్రిని ఎదురించిన బాలయ్య, లైఫే మారిపోయింది

నాన్న రామారావుకి బాలయ్య చిన్నప్పుడు భయపడేవారు. తాను ఏం చేయాలనుకుంటున్నాడో అనే విషయాలు కూడా చెప్పలేని పరిస్థితి. దీంతో తనకు ఇష్టం లేకపోయినా ఆయన ఇంటర్‌లో బైపీసీ తీసుకున్నారు. ఎన్టీఆర్‌కి.. బాలయ్యని డాక్టర్‌ని చేయాలని ఉండేది. అందుకే బైపీసీ తీసుకోమని చెబితే, మరో మాట లేకుండా అదే కోర్స్ తీసుకున్నాడు. తర్వాత మెడికల్‌ ఎంట్రెస్ట్ టెస్ట్ కూడా రాశారు. కానీ రాలేదు. బేసిక్‌గా ఆ చదువుకోవడం, మెడిసిన్‌ చేయడం బాలయ్యకి ఇష్టం లేదు. సినిమాలు చేయడమే ఇష్టం. దీంతో ఈ విషయంలో తండ్రినే ఎదురించాడు. సినిమాల్లోకి వచ్చాడు. బాలయ్యలో ఉన్న ఉత్సాహం, తపన చూసి రామారావు కూడా ఏం అనలేదట.

44
డాక్టర్‌ కావాల్సిన బాలయ్య యాక్టర్‌
Image Credit : Asianet News

డాక్టర్‌ కావాల్సిన బాలయ్య యాక్టర్‌

అలా డాక్టర్‌ కావాల్సిన బాలకృష్ణ.. యాక్టర్‌ అయ్యాడు. ఈ విషయాన్ని ఆయన కూతురు నారా బ్రహ్మాణి వెల్లడించారు. గతంలో సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను ఆమె పంచుకున్నారు. బాలయ్య నిర్ణయం, డేర్‌ ఆయన జీవితాన్నే మార్చేసింది. టాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌ని చేసింది. కోట్ల మందికి దగ్గర చేసింది. ఇప్పటికీ యంగ్‌ హీరోలకు పోటీ ఇస్తూ ఆయన సినిమాలు చేస్తుండటం విశేషం. ప్రస్తుతం ఆయన గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఇది ప్రారంభమైంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ
నందమూరి తారక రామారావు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Missing Meghana Review: మిస్సింగ్‌ మేఘన మూవీ రివ్యూ.. రామ్‌ కార్తీక్‌, అంకిత్‌ కొయ్య థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?
Recommended image2
Jabardasth: మెగాస్టార్ నే మెప్పించిన జబర్దస్త్ కమెడియన్, ఒక్క ఏడాది 8 సినిమాలు, భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న నటుడు ఎవరు?
Recommended image3
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Related Stories
Recommended image1
OTT Releases: ఈ వారం ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఇవే.. తెలుగు ఆడియెన్స్ కి పండగే
Recommended image2
Mahesh Babu: బ్లాక్‌ బస్టర్‌ కావాల్సిన మహేష్‌ బాబు సినిమాని డిజాస్టర్‌ చేసిన స్టార్‌ డైరెక్టర్‌.. కోలుకోలేని దెబ్బ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved