నందమూరి బాలకృష్ణని టార్గెట్ చేస్తూ నాగబాబు వేస్తోన్న కౌంటర్ల సంగతి తెలిసిందే. ఈ వివాదం మధ్యలోకి దూరిన శ్రీరెడ్డి.. నాగబాబుని టార్గెట్ చేస్తూ ఓ ఫన్నీ వీడియోని పోస్ట్ చేసింది. ఇప్పుడు ఏకంగా ఓ అడుగు ముందుకేసి పవన్ పై విమర్శలు కురిపించింది. నాగబాబు కౌంటర్లను తిప్పి కొట్టడానికి పవన్ ఎవరో నాకు కూడా తెలియదంటూ ఓ పోస్ట్ పెట్టింది.

''పవన్ ఎవరో నాకు తెలుసు.. ఆయన మంచి ఆర్టిస్.. చాలా బాగా పెయింటింగ్ వేస్తాడు.. పవన్ బాన్వాల్ అనే ఆయన మంచి పెయింటర్. ఆ పవన్ తప్ప వేరే పవన్ ఎవరూ నాకు తెలియదు.. ఈయన తప్ప వేరే పవన్ లు ఉంటారు.. ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ నార్మల్ పర్సన్స్ ఉంటారు.. వాళ్లెవరో నాకు తెలియదు'' అంటూ వీడియో పోస్ట్  చేసింది.

గతంలో నాగబాబు.. బాలకృష్ణ తెలుసంటూ ఒకప్పటి కమెడియన్ ఫోటోని చూపించి ఎలా రియాక్ట్ అయ్యాడో.. ఇప్పుడు శ్రీరెడ్డి కూడా అదే విధంగా స్పందించింది. ఆ తరువాత కొంతసేపటికి మరో వీడియో పోస్ట్ చేసింది. ఈసారి కాస్త శ్రుతిమించి పవన్ పై ఇష్టానుసారం వివాదాస్పద కామెంట్స్ చేసింది. 

''ఇప్పుడే నాకు ఆంద్ర నుండి కొంతమంది ఫోన్ చేసి చెప్పారు. పవన్ అంటే దొంగచూపులు చూసుకుంటూ, దొంగకోళ్లు పట్టేవాడిలా ఉంటారట. లక్షల పుస్తకాలు చదివానని, ఎప్పుడు అబద్ధాలు చెబుతూ, పెళ్లి మీద పెళ్లి చేసుకుంటూ దేశసేవ చేస్తానంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారట'' అంటూ పవన్ పై మండిపడింది.

''యూఎస్ వెళ్లి డబ్బులు వద్దంటూ తీసుకోవడం, కులపిచ్చి లేదంటూ మీ కులాల్ని మెప్పించడం, అమ్మాయిల పిచ్చి లేదంటూనే వాళ్ల వెంట పడడం.. ఇదేనా పవన్ అంటే'' అంటూ విరుచుకుపడింది. పవన్ ని చూసి యువత ఏం నేర్చుకోవాలని ప్రశ్నించింది. ఇకనైనా బాలయ్యని విమర్శించడం మానుకోవాలని వార్నింగ్ ఇచ్చింది. 

 

 

 

 

బాలయ్య వర్సెస్ నాగబాబు మధ్యలో శ్రీరెడ్డి వీడియో!

మీరేమైనా దిగొచ్చారా..? బాలయ్యపై నాగబాబు మూడో కామెంట్!

మీరేనా సూపర్ స్టార్లు.. బాలయ్యపై విరుచుకుపడ్డ నాగబాబు!

బాలయ్య వర్సెస్ నాగబాబు.. కామెంట్ నెం 1!

ఎన్టీఆర్ బయోపిక్: బాలయ్యపై నాగబాబు సెటైరికల్ కవిత!

బాలయ్యకి నాగబాబు కౌంటర్..సోషల్ మీడియాలో వైరల్

బాలకృష్ణ మంచి కమెడియన్: నాగబాబు వ్యాఖ్య!

బాలయ్య, నాగబాబు ఎపిసోడ్.. టాలీవుడ్ ఇన్సైడ్ టాక్ ఏంటంటే..?