సౌతిండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'పేటా' సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోలివుడ్ లో ఈ సినిమాపై క్రేజ్ మాములుగా లేదు. తెలుగు, తమిళ భాషలలో రేపే ఈ సినిమా విడుదలవుతుంది.

అయితే తెలుగులో ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరకలేదు. మూడు స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతి బరిలో ఉండడంతో 'పేటా' సినిమాకి థియేటర్ల కొరత ఏర్పడింది. తనకు థియేటర్లు దొరక్కుండా నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింది, యూవీ క్రియేషన్స్ వారు ఇబ్బంది పెడుతున్నారని 'పేటా' తెలుగు నిర్మాత అశోక్ వల్లభనేని మండిపడ్డారు. ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. 

ఇప్పుడు ఈ వివాదంపై నటి శ్రీరెడ్డి స్పందించింది. సోషల్ మీడియా వేదికగా ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. ''లెజండరీ నటుడు రజినీకాంత్ గారు నటించిన 'పేటా' సినిమాకి తెలుగులో చాలా తక్కువ థియేటర్లు ఇచ్చారు. ఈ విషయంలో టాలీవుడ్ థియేటర్ మాఫియా సిగ్గు పడాలి. సురేష్ బాబు, దిల్ రాజు, అల్లు అరవింద్, సునీల్ నారంగ్ వంటి వారు చిన్న నిర్మాతలు ఆత్మహత్య చేసుకొని చనిపోయే పరిస్థితులను క్రియేట్ చేస్తున్నారని'' సంచలన వ్యాఖ్యలు చేసింది. 

అంతేకాదు.. మీ కుటుంబ సభ్యులు ఎవరూ సంతోషంగా ఉండలేరని, మీ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు నటించిన చిత్రాలను తమిళనాడులో బ్యాన్ చేయాలని కామెంట్స్ చేసింది. 

'పేటా' చిత్రానికి రెండే థియేటర్లు.. షాక్ లో నిర్మాత!

''దిల్ రాజు, అల్లు అరవింద్ లను చెప్పులతో కొడతారు''

'పేటా' నిర్మాత కామెంట్స్ పై దిల్ రాజు కౌంటర్లు!

'పేటా' నిర్మాతపై అల్లు కాంపౌండ్ ఫైర్!

''అల్లు అరవింద్, దిల్ రాజు కుక్కలా..?''