సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా విడుదలవుతుందంటే ఆ హడావిడే వేరు. తెలుగులో కూడా ఆయన చిత్రాలను భారీ ఎత్తున విడుదల చేస్తుంటారు. కానీ ఆయన నటించిన 'పేటా' సినిమాకి మాత్రం రెండు థియేటర్లను మాత్రమే కేటాయించడం నిర్మాతలకు షాక్ ఇస్తోంది. 'పేటా' సినిమాకు సంబంధించి థియేటర్ వివాదం కొద్దిరోజులుగా జరుగుతోన్న సంగతి తెలిసిందే.

దిల్ రాజు, అల్లు అరవింద్, యువి క్రియేషన్స్ వారు థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని 'పేటా' నిర్మాత అశోక్ వల్లభనేని కామెంట్స్ చేశారు. సంక్రాంతి బరిలో మూడు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు బరిలో నిలిస్తే.. ఒక అనువాద చిత్రానికి థియేటర్లు ఎలా సర్దుబాటు చేస్తామని దిల్ రాజు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. తమిళ అనువాద చిత్రం 'పేటా'కి థియేటర్లు ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పారు తెలుగు నిర్మాతలు. 

దీంతో వివాదం కాస్త మరింత ముదిరింది. అయితే ఆరు నెలల ముందే ఎన్టీఆర్ బయోపిక్, వినయ విధేయ రామ, ఎఫ్ 2 చిత్రాలు రిలీజ్ డేట్ ని కన్ఫర్ చేయడంతో 'పేటా'కి థియేటర్ల కొరత ఏర్పడింది. 11న వినయ విధేయ రామ, 12న ఎఫ్ 2 చిత్రాలు ఉండడంతో 'పేటా' ఒకరోజుకి మాత్రమే పరిమితం కాబోతుంది.

జనవరి 10 తరువాత హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సప్తగిరి థియేటర్, మల్కాజ్ గిరి రాఘవేంద్ర థియేటర్ లను మాత్రమే 'పేటా'కి కేటాయించారు. ఒకవేళ సినిమాకి హిట్ టాక్ వస్తే ఆ తరువాత థియేటర్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి.  

''దిల్ రాజు, అల్లు అరవింద్ లను చెప్పులతో కొడతారు''

'పేటా' నిర్మాత కామెంట్స్ పై దిల్ రాజు కౌంటర్లు!

'పేటా' నిర్మాతపై అల్లు కాంపౌండ్ ఫైర్!

''అల్లు అరవింద్, దిల్ రాజు కుక్కలా..?''