నిన్న జరిగిన 'పేటా' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిత్రనిర్మాతలుప్రసన్న కుమార్, అశోక్ వల్లభనేని అగ్ర నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, యువి క్రియేషన్స్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

'పేటా' చిత్రానికి థియేటర్లు దొరక్కుండా చేస్తున్నారని, మంచి చిత్రాలను వదిలేసి తమకు నచ్చిన సినిమాలను థియేటర్లలో ఆడిస్తున్నారని కామెంట్స్ చేశారు అశోక్ వల్లభనేని. దీంతో అల్లు కాంపౌండ్ వ్యక్తి నిర్మాత బన్నీ వాసు.. అశోక్ పై ఫైర్ అయ్యారు. పరోక్షంగా ఆయనకి వార్నింగ్ ఇచ్చాడు. 

ఇప్పుడు దిల్ రాజు కూడా ఈ విషయంపై స్పందించారు. సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు విడుదలవుతున్న నేపధ్యంలో డబ్బింగ్ సినిమాకి థియేటర్లు ఎలా దొరుకుతాయని ఆయన ప్రశ్నించారు. మూడు సినిమాలకే థియేటర్లు సరిపోని పరిస్థితి నెలకొందని అన్నారు.

జనవరి 18 నుండి థియేటర్లలో 'పేటా' మాత్రమే ఉంటుందని అశోక్ చెబుతున్నారని, మరి ఆ రోజే 'పేటా' విడుదల చేసుకోవచ్చు కదా అని సలహా ఇచ్చారు. తెలుగు సినిమాల విడుదల తేదీ ఆరు నెలల ముందే ప్రకటించామని, అశోక్ వల్లభనేని ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడడం కరెక్ట్ కాదని అన్నారు.  

'పేటా' నిర్మాతపై అల్లు కాంపౌండ్ ఫైర్!

''అల్లు అరవింద్, దిల్ రాజు కుక్కలా..?''