'పేట' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో సహనం కోల్పోయిన నిర్మాత అశోక్ వల్లభనేని టాలీవుడ్ అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, యువి క్రియేషన్స్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. వారు కుక్కలని, థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అశోక్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినా.. అల్లు కాంపౌండ్ వ్యక్తి బన్నీ వాసు, దిల్ రాజులు హుందాగా ప్రవర్తించి బదులిచ్చారు. ఇప్పుడు మరోసారి అశోక్ వల్లభనేని నోరు పారేసుకున్నారు.

ఓ టీవీ ఛానెల్ లో చర్చావేదికలో పాల్గొన్న అశోక్ వల్లభనేని.. అల్లు అరవింద్, దిల్ రాజుల ఫ్యామిలీలను టార్గెట్ చేసి మాట్లాడారు. వారి ఇంటి అమ్మాయిలపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారు.. అంతేకాదు వీళ్ల నలుగురిని(అల్లు అరవింద్, దిల్ రాజు, యువి క్రియేషన్స్) చెప్పులతో కొట్టే రోజు వస్తుందని అన్నారు.

అద్దాల మేడల్లో ఉన్న వీళ్లను.. పగలగొట్టే రోజు వస్తుందని అనుచిత వ్యాఖ్యలు చేసి డిస్కషన్ మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. ఇప్పటివరకు సినిమాలు, థియేటర్ల వరకు  పరిమితమైన ఈ వివాదం ఇప్పుడు నిర్మాతల కుటుంబాల వరకు రావడంతో ఈ అగ్ర నిర్మాతలు చూస్తూ ఉంటారని అనుకోవడానికి లేదు. మరి ఈ వివాదం ఇంకెక్కడి వరకు వెళ్తుందో చూడాలి!

'పేటా' నిర్మాత కామెంట్స్ పై దిల్ రాజు కౌంటర్లు!

'పేటా' నిర్మాతపై అల్లు కాంపౌండ్ ఫైర్!

''అల్లు అరవింద్, దిల్ రాజు కుక్కలా..?''