కర్నాటక సీఎం హెచ్ డి కుమారస్వామి రెండో భార్య రాధిక కుమారస్వామి ఒకప్పుడు హీరోయిన్ అనే విషయం తెలిసిందే. కుమారస్వామిని వివాహం చేసుకున్న తరువాత ఆమె సినిమాలకు దూరమయ్యారు.

మొన్నామధ్య ఆమె రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతూ ఆమె సినిమాలలో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో నవరసన్ అనే దర్శకుడు రూపొందిస్తోన్న సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాకి 'దమయంతి' అనే టైటిల్ ని ఖరారు చేశారు.

నవంబర్ 12న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. లేడీ ఓరియెంటెడ్ కథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రాధిక కుమారస్వామి సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తోంది. 1980వ సంవత్సరం బ్యాక్ డ్రాప్ లో సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

ఈ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ భారీగా ఉంటుందని తెలుస్తోంది. కన్నడలో ఈ సినిమాను రూపొందించి తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాతో పాటు రాధిక కుమారస్వామి 'భైరదేవి' అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమాలో రమేష్ అరవింద్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.  

ఇవి కూడా చదవండి.. 

ఆ హీరోలతో రొమాన్స్ కి సిఎం భార్య రెడీ!

సిఎం భార్య మళ్లీ నటిస్తుందా?

కాబోయే సీఎం భార్య హీరోయిన్ అట!