కాబోయే సీఎం భార్య హీరోయిన్ అట!

heroine radhika wife of Karnataka CM-designate
Highlights

రాజకీయనేతలు హీరోయిన్లను పెళ్లి చేసుకోవడం చాలా అరుదుగా 

రాజకీయనేతలు హీరోయిన్లను పెళ్లి చేసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అయితే జేడీఎస్ నేత కుమారస్వామి కూడా హీరోయిన్ నే పెళ్లి చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ విషయం ట్రెండింగ్ అవుతోంది.

ప్రస్తుత కర్ణాటక రాజకీయాలను బట్టి కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మరోపక్క ఆయన భార్య రాధిక ఒకప్పటి హీరోయిన్ అనే విషయం గూగుల్ లో ట్రెండింగ్ గా మారింది. కుమారస్వామి 1986 లోనే అనిత అనే మహిళను వివాహం చేసుకున్నారు. వారికి పుట్టిన బిడ్డే నిఖిల్ గౌడ. అయితే నటి రాధికను కుమారస్వామి రెండో వివాహం చేసుకున్నారు.

2005 లో వీరిద్దరికీ పరిచయం ఏర్పడగా, 2006 లో వారి వివాహం జరిగింది. కానీ ఆ విషయాన్ని నాలుగేళ్ల తరువాత వెల్లడించారు. వీరిద్దరికీ షమికా అనే కుమార్తె కూడా ఉంది. తమిళంలో దాదాపు 32 చిత్రాల్లో నటించిన రాధికా ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతోంది. 

loader