కర్ణాటక ఎలెక్షన్స్ సమయంలో కుమారస్వామి రెండో భార్య రాధికా కుమారస్వామి  పేరు బాగా వినిపించింది. కొద్దిరోజులు పాటు ఆమె గూగుల్ లో ట్రెండ్ అయింది. జనాలు ఆమె గురించి తెలుసుకోవడానికి అంతగా ప్రయత్నించారు.

తారకరత్నతో కలిసి 'భద్రాద్రి రాముడు' సినిమాలో నటించి తెలుగు వారికి కూడా పరిచయమైంది. కుమారస్వామిని పెళ్లి చేసుకొని ఓ పాపకు జన్మనిచ్చిన రాధికా కొన్నాళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా గడుపుతోంది. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ కానుంది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. అవి కూడా లీడ్ క్యారెక్టర్లే కావడం విశేషం. కాంట్రాక్ట్, రాజేంద్ర పొన్నప్ప, భైరదేవి, నిమగగి అనే నాలుగు సినిమాల్లోనటిస్తోంది.

కాంట్రాక్ట్ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటిస్తుండగా, భైరదేవి సినిమాలో రమేష్ అరవింద్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. భర్త ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ.. రాధికా మాత్రం సినిమాలపై దృష్టి పెట్టడానికి సిద్ధమయ్యారు. మరి యువ హీరోయిన్లకు ఆమె ఏమాత్రం పోటీనిస్తారో చూడాలి!