సిఎం భార్య మళ్లీ నటిస్తుందా?

Radhika kumaraswamy to make acting comeback
Highlights

కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎన్నికైన కుమారస్వామి భార్య రాధిక కుమారస్వామి గతంలో నటిగా కొన్ని 

కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎన్నికైన కుమారస్వామి భార్య రాధిక కుమారస్వామి గతంలో నటిగా కొన్ని సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. కర్ణాటక ఎన్నికల సమయంలో కుమారస్వామి భార్య నటి అనే విషయం ట్రెండ్ అయింది. ఆమె గురించి గూగుల్ లో సెర్చ్ చేసిన వారి సంఖ్య లక్షల్లో ఉంది. ఇది ఇలా ఉండగా.. కుమారస్వామిని వివాహం చేసుకున్న తరువాత ఆమె సినిమాలకు దూరమయ్యారు.

తన భర్త, కూతురుతోనే సమయం గడిపారు. అయితే ఇప్పుడు మళ్లీ నటిగా ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్తలు ఊపందుకున్నాయి. యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రలో నటించనున్న సినిమాలో ముఖ్య పాత్ర కోసం రాధికను సంప్రదించినట్లు సమాచారం. కథ అందులో ఆమె పాత్ర కొత్తగా అనిపించడంతో ఆమె నటించడానికి అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇదంతా కూడా కర్ణాటక ఎన్నికలకు ముందు జరిగిన వ్యవహారమని తెలుస్తోంది.

ఎన్నికల్లో కుమారస్వామి ముఖ్యమంత్రి ఎన్నికయ్యారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి భార్య నటిగా మళ్లీ సినిమాలు చేస్తారా..? అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. అయితే ఈ విషయంపై రాధికా కుమారస్వామి ఇప్పటివరకు స్పందించలేదు. 
 

loader